కరోనా వల్ల భారత్‌లో గత కొన్నిరోజుల నుంచి లాక్డౌన్ విధించారు. ఈ ప్రభావంతో రోజువారి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం వినూత్న ప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఓ రెండు సేవాసంస్థలతో కలిసి విరాళాలు సేకరించనున్నాడు.
ఇందులో భాగంగా గివ్ ఇండియా అనే సంస్థ.. సుమారు 60 వేల మంది కార్మికులను గుర్తించింది. ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని, మనమందరం కలిసి ఆదుకుందామని కథానాయకుడు అర్జున్ అన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
tofankind.org వెబ్సైట్లోకి లాగిన్ అయి ఎవరైనా సరే తమకు తోచినంత విరాళం ఇవ్వొచ్చని చెప్పాడు అర్జున్. ఇలా ఇచ్చిన వారిలో ఓ ఐదుగురు లక్కీ విన్నర్స్‌ను ఎంపిక చేసి, ఈనెల 11న వారితో వర్చువల్ డేటింగ్‌కు వెళతానని అన్నాడు. ఆ సమయంలో వారు చెప్పినవి వింటూ, వారితో మాట్లాడుతూ, కలిసి భోజనం చేస్తానని పేర్కొన్నాడు.