ETV Bharat / sitara

కరోనా ఎఫెక్ట్​: ఆరంభం అదరహో.. తర్వాత బెదరహో - allu arjun

మహేష్‌ విజృంభించాడు. బన్నీ అదరగొట్టాడు. ఆ జోరు చూసి... ఇలా సాగనీ అనుకున్నాడు సగటు సినీ అభిమాని. వ్యాపార వర్గాలు కొత్త ఉత్సాహంతో కనిపించాయి. మధ్యలో కొన్నాళ్లు విజయాలు దూరమైనా వేసవి ముందుంది కదా అని కొండంత ధీమా. కానీ కరోనాతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. థియేటర్లు వెలవెలబోయాయి. చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. వేసవే కాదు... 2020 సినిమా క్యాలెండరే అస్తవ్యస్తంగా మారిపోయింది. ఓపెనర్లు సెంచరీలు కొట్టాక... మ్యాచ్‌ రద్దైపోయినట్టుగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి. గడిచిన ఆర్నెల్లకాలంలో పరిశ్రమకి ఎలాంటి ఫలితాలు దక్కాయో ఓసారి చూద్దాం...

Corona Effect On Telugu Cinema Industry
కరోనా ఎఫెక్ట్​: ఆరంభం అదరహో.. తర్వాత బెదరహో
author img

By

Published : Jun 29, 2020, 7:02 AM IST

ఏడాదిలో తొలి సగం చిత్ర పరిశ్రమకి అత్యంత కీలకం. అగ్ర కథానాయకుల జోరు కనిపించేది... సింహ భాగం వసూళ్లు వచ్చేది తొలి సగంలోనే. ఈ ఫలితాలే మలి సగంలో వచ్చే సినిమాల్ని, వాటి వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఎప్పట్లాగే 2020ని తెలుగు చిత్రసీమ ఉత్సాహంగా ఆరంభించింది.

ఆ నెలలోనే...

తెలుగు నాట సంక్రాంతి అనగానే సినిమాలే గుర్తుకొస్తాయి. జనవరిలో అగ్ర కథానాయకుల చిత్రాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతుంటాయి. ఈ యేడాది రజనీకాంత్‌ 'దర్బార్‌', మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్‌ 'అల.. వైకుంఠపురములో' చిత్రాలు విడుదలయ్యాయి. వీటితో పాటు కల్యాణ్‌రామ్‌ 'ఎంత మంచివాడవురా' ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'దర్బార్‌' రజనీ అభిమానుల్ని మెప్పించినా వసూళ్లు రాబట్టలేకపోయింది. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందడం సహా వాణిజ్య పరంగానూ సత్తా చాటాయి.

ఇది చిత్ర పరిశ్రమకి కొత్త హుషారునిచ్చింది. వీటి హవా కొనసాగుతున్న సమయంలోనే రవితేజ 'డిస్కోరాజా', నాగశౌర్య నటించిన 'అశ్వథ్థామ' విడుదలయ్యాయి. రెండు చిత్రాలూ మంచి ప్రయత్నాలే అనిపించుకున్నా బాక్సాఫీసు దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. సంక్రాంతికి ముందు చిన్న చిత్రాలు బోలెడన్ని ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో కన్నడ నుంచి వచ్చిన అనువాద చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ' కొత్త ప్రయత్నం అనిపించుకున్నా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ ఆర్నెళ్ల కాలంలో తొలి నెలలో వచ్చిన వసూళ్లే పరిశ్రమకి కాస్త ఊరటనిచ్చాయి. మిగిలిందంతా నష్టాల కథే.

Corona Effect On Telugu Cinema Industry
'భీష్మ' చిత్రంలో రష్మిక, నితిన్​

రెండు విజయాలు

పండగ తర్వాత విడుదలైన సినిమాలేవీ ప్రభావం చూపించలేదు. దాంతో రెండో నెలలో విడుదలయ్యే సినిమాలపైనే ఆశలు పెంచుకున్నారు ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు. 'జాను', 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌', 'భీష్మ'... ఇలా అంచనాలు రేకెత్తించిన సినిమాలే బాక్సాఫీసు ముందుకు వరస కట్టాయి. ఘన విజయం సాధించిన తమిళ చిత్రం '96'కి రీమేక్‌గా తెరకెక్కిన 'జాను' మాతృకలోని మేజిక్‌ని పునరావృతం చేయలేదు. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' మంచి కథ అనిపించినా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. నితిన్‌ కథానాయకుడిగా 'భీష్మ' బాక్సాఫీసు దగ్గర మరో మంచి విజయాన్ని నమోదు చేసింది. 'సవారి', 'డిగ్రీ కాలేజ్‌', 'ప్రెషర్‌ కుకర్‌', 'హిట్‌' వంటి చిన్న చిత్రాలు ప్రచారంతో ఆకట్టుకున్నాయి.

అయితే వీటిలో 'హిట్‌' మాత్రమే వసూళ్లు రాబట్టింది. అలా రెండో నెల రెండు విజయాలతో సరిపెట్టుకుంది. అనువాద చిత్రంగా విడుదలైన 'కనులు కనులను దోచాయంటే' బాగున్నా ప్రచార లోపంతో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. కరోనా ప్రభావంతో...అంతంత మాత్రం విజయాలు, అంతంతే వసూళ్లతో సతమతమవుతూ వేసవి వైపు చూస్తున్న చిత్ర పరిశ్రమని ఒక్కసారిగా దెబ్బకొట్టింది కరోనా. మార్చి నెల ఆరంభం నుంచే ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి ఇష్టపడలేదు. దాంతో చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. 'పలాస 1978' ఒక్కటే మంచి ప్రయత్నం అనిపించుకుంది. అయినా వసూళ్లు లేవు. 'ఓ పిట్టకథ'కి మంచి ప్రచారమే దక్కినా అది ఆకట్టుకోలేకపోయింది. కరోనా ప్రభావం అంతకంతకూ పెరగడం వల్ల మార్చి 15 నుంచి తెలంగాణలో, ఆ తర్వాత ఆంధ్రలో థియేటర్లు మూతపడిపోయాయి. ఇక వేసవి సీజన్‌ మొత్తం కరోనార్పణం అయిపోయింది. 'వి', 'రెడ్‌', 'నిశ్శబ్దం', 'అరణ్య', 'ఉప్పెన'... ఇలా ఏప్రిల్‌ నెలలో ఆసక్తికరకమైన సినిమాలే విడుదలకి సిద్ధమయ్యాయి. కరోనావల్ల ఆ సినిమాలన్నీ ఆగిపోయాయి.

ఓటీటీలే మార్గమయ్యాయి

అభిమానులకు ఓటీటీ వేదికలే దిక్కయ్యాయి. లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లోనే ఓటీటీ వేదికల్లో భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని ఆస్వాదించారు ప్రేక్షకులు. దాంతో కొద్దిమంది నిర్మాతలు నేరుగా ఓటీటీలో విడుదల చేయడంపై మొగ్గు చూపారు. 'అమృతారామమ్‌', 'శక్తి', 'రన్‌', 'పెంగ్విన్‌', 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల', 'క్లైమాక్స్‌' చిత్రాలు ఈ వేదికల్లో విడుదలయ్యాయి. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణలకి అనుమతులిచ్చినా... థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఇప్పటికప్పుడు తెరుచుకున్నా అగ్ర కథానాయకుల చిత్రాలన్నీ ఇంకా సగంలోనే ఉన్నాయి. వేసవికి రావాల్సిన 'వకీల్‌సాబ్‌' సంక్రాంతికి విడుదల కాబోతోందని సమాచారం. 2020లో విడుదల కావల్సిన చాలా సినిమాలు వచ్చే ఏడాది లక్ష్యంగా సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి.

"ఈ యేడాది చిత్ర పరిశ్రమకి పెద్ద దెబ్బ. సెట్స్‌పై ఉన్న సినిమాలకి, విడుదలకి సిద్ధమైన సినిమాలకి చాలా నష్టం జరిగింది. వచ్చే ఆర్నెళ్ల కాలంలోనూ పురోగతి అంటూ ఏమీ ఉండదు. థియేటర్లు తెరచుకున్నా ప్రేక్షకులు ధైర్యంగా వస్తారనే నమ్మకం లేదు. కరోనాకి ఔషధం వచ్చాకే ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్‌కి వస్తార"ని ఓ ప్రముఖ నిర్మాత చెప్పారు.

ఇదీ చూడండి... మెగాస్టార్ 'జెంటిల్​మేన్' కావాల్సింది.. ప్చ్​ కుదర్లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.