బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ నటుడు ధనుష్ హీరోలుగా ఓ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ ఇద్దరి కథానాయకులతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అట్రాంగిరే'. సారా అలీఖాన్ కథానాయిక. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.
![Confirmed! Sara to feature with Akshay-Dhanush in Atrangi Re](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5895713_w34-2.jpg)
హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్.రెహమాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. 2021 ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: 'మ్యాట్రిక్స్' నూతన సిరీస్లో 'ప్రియాంకచోప్రా'..!