ETV Bharat / sitara

'దిశ రేప్​' వ్యవహారంలో సల్మాన్​, రవితేజ, రకుల్​పై కేసు - disha rape incident

'దిశ రేప్​' ఘటనకు సంబంధించి ప్రముఖ సినీనటులపై దిల్లీలోని ఓ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. అత్యాచార బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారంటూ వారిపై ఫిర్యాదు చేశారు అడ్వకేట్ గౌరవ్ గులాటీ.

salman khan, ravi teja, rakul
సల్మాన్, రవితేజ, రకుల్
author img

By

Published : Sep 5, 2021, 10:46 AM IST

2019లో హైదరాబాద్​లో జరిగిన దిశ హత్యాచారానికి సంబంధించి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్​ సహా 38 మందిపై కేసు నమోదైంది. బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల వేదికగా బహిర్గతం చేసినందుకు ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు న్యాయవాది గౌరవ్ గులాటీ.

అదే సమయంలో.. సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు గౌరవ్. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరవ్. హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:'సల్మాన్‌ రిక్వెస్ట్‌ చేస్తేనే కౌగిలించుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.