ETV Bharat / sitara

'ఏజెంట్‌ ఆత్రేయ' తమిళ రీమేక్‌లో సంతానం! - 'ఏజెంట్‌ ఆత్రేయ' తమిళ రీమేక్‌

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' తమిళ రీమేక్​ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు 'సంతానం' ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మనోజ్‌ బీద దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Agent sai srinivas Athreya
ఏజెంట్‌ ఆత్రేయ
author img

By

Published : Jan 31, 2021, 10:24 AM IST

తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి విజయాలు సాధించవచ్చని నిరూపించిన చిత్రాల్లో 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ముందు వరుసలో ఉంటుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో యువనటుడు నవీన్‌ పొలిశెట్టి డిటెక్టివ్‌గా కనిపించి మెప్పించాడు. తెలుగులో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఇతర భాషల్లో అలరించేందుకు సిద్ధమవుతోంది.

తమిళ రీమేక్‌లో డిటెక్టివ్‌ పాత్రలో ప్రముఖ హాస్యనటుడు సంతానం కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఈ సినిమా మనోజ్‌ బీద దర్శకత్వంలో తెరకెక్కనుంది. సినిమా చిత్రీకరణ కూడా అతి త్వరలో ప్రారంభం కానుందని తెలిసింది. మరికొన్ని రోజుల్లో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలుగులో వచ్చిన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'కు స్వరూప్‌ దర్శకత్వం వహించారు. నవీన్‌పొలిశెట్టి, స్వరూప్‌ సంయుక్తంగా స్క్రీన్‌ప్లే అందించారు. నవీన్‌తో పాటు శ్రుతిశర్మ, సందీప్‌రాజ్‌, సుహాస్‌ కీలక పాత్రల్లో కనిపించారు. 2019 జూన్‌ 21న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

ఇదీ చూడండి : గల్లీ క్రికెట్​ ఆడిన జాన్వీ.. అభిమానులు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.