లఘుచిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టి.. 'పెళ్లిచూపులు' సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రియదర్శి. అతనిలోని కామెడీ టైమింగ్‌కు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మల్లేశం' సినిమాలో హీరోగా నటించి.. అందర్నీ మెప్పించాడు. తాను కేవలం నవ్వించడమే కాదు.. ఏడిపించగలనని నిరూపించుకున్నాడు.
-
@KChiruTweets గారికి, గురుభ్యోనమః ఇది పోలిక కనే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తిని పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చుపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ #Loser మీకు అంకితం🙏 pic.twitter.com/p2S4mtsZZ3
— Priyadarshi (@priyadarshi_i) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">@KChiruTweets గారికి, గురుభ్యోనమః ఇది పోలిక కనే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తిని పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చుపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ #Loser మీకు అంకితం🙏 pic.twitter.com/p2S4mtsZZ3
— Priyadarshi (@priyadarshi_i) May 14, 2020@KChiruTweets గారికి, గురుభ్యోనమః ఇది పోలిక కనే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తిని పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చుపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ #Loser మీకు అంకితం🙏 pic.twitter.com/p2S4mtsZZ3
— Priyadarshi (@priyadarshi_i) May 14, 2020
గురువుకి అంకితం
ప్రస్తుతం 'లూసర్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న ప్రియదర్శి చిరంజీవి గురించి చెప్పుకొచ్చాడు. ఆ వెబ్ సిరీస్‌లోని ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "అన్నయ్య చిరంజీవి గారికి, గురుభ్యోనమః. ఇది పోలిక కానే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతోమంది స్ఫూర్తిని పొందారు. మీరు నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చుపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ #లూసర్ మీకు అంకితం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి.. అవకాశాలు ఊరికే రావు: నేహా శర్మ