బుల్లితెరపై మంచిపేరు సంపాదించుకుంది నటి హిమజ. 'జబర్దస్త్' వేదికగా హాస్యనటుడిగా ప్రేక్షకాదరణ పొందాడు చలాకీ చంటి. వీరిద్దరూ ఇటీవల 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'సెలిబ్రిటీ అవ్వడానికి గల కారణమేంటి' అని చంటిని ప్రశ్నించాడు ఆలీ. దానికి కారణం 'సినీ నటి ఊహా' అని సమాధానమిచ్చాడు చంటి.
"నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో.. కల్చరల్ ప్రెసిడెంట్(సాంస్కృతిక అధ్యక్షుడు)గా ఉండేవాడిని. ఆ సమయంలో పెత్తనమంతా నా చేతుల మీదుగానే నడిచేది. అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉంటే.. నాకంటే పెద్దవాళ్లైన పదో తరగతి విద్యార్థులను బెదిరించేవాడిని. దానివల్ల అందరూ నాకు గౌరవం ఇచ్చేవారు. కానీ, ఓరోజు పాఠశాల వార్షికోత్సవానికి ఊహా గారు మా బడికి వచ్చారు. అప్పుడు అందరూ ఊహాను చూడాలనే ఆత్రుతతో నన్ను తీసిపారేశారు. నన్ను గౌరవించలేదు. అప్పుడే అనుకున్నా. మనం ఒక స్టేజ్‌కు వస్తేనేగానీ, మనకు ఓ స్టేజ్ ఉండదని. అందుకోసమే సెలిబ్రిటీ అవ్వాలని అనుకున్నా."
-చలాకీ చంటి.
తన విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగిందని తెలిపాడు చంటి. తన తండ్రి ఒకప్పుడు అగరుబత్తుల వ్యాపారం చేసేవాడని చెప్పాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:'పగవాడికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదు'