ETV Bharat / sitara

తండ్రిని చదివించిన కొడుకు... కారణం అదే! - కాలేజ్​ కుమార్​

సాధారణంగా కొడుకును ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తండ్రీ కలలు కంటాడు. అందుకు చాలా ఇబ్బందులే ఎదుర్కొంటాడు. ఇందుకు భిన్నంగా ఓ తండ్రిని కొడుకు చదివించడం అనే ముఖ్య ఉద్దేశంతో రూపొందుతోంది ఓ చిత్రం. చదవడం గొప్పా.. చదివించడం గొప్పా అనే కథాంశంతో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ముడి పెడుతూ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హరి సంతోష్​.

College Kumar is a romantic family entertainer movie directed by Hari Santhosh
తండ్రిని చదివించిన కొడుకు కారణం అదే!
author img

By

Published : Mar 3, 2020, 9:19 AM IST

రాహుల్‌ విజయ్‌, ప్రియ వడ్లమాని జంటగా నటిస్తున్న చిత్రం 'కాలేజ్‌ కుమార్‌'. రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రపోషిస్తున్నారు. హరి సంతోష్‌ దర్శకుడు. ఎల్‌.పద్మనాభ నిర్మాత. లక్ష్మణ గౌడ సమర్పిస్తున్న ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల ముందస్తు వేడుక ఘనంగా నిర్వహించారు. హీరో గోపీచంద్‌, దర్శకుడు గోపీచంద్‌ మలినేని, రామ్‌లక్ష్మణ్‌ అతిథులుగా హాజరయ్యారు.

College Kumar is a romantic family entertainer movie directed by Hari Santhosh
తండ్రిని చదివించిన కొడుకు కారణం అదే!

" నేనీ వేడుకకు వచ్చానంటే కారణం విజయ్‌ మాస్టర్‌. మాలాంటి హీరోలకు యాక్షన్‌ ఇమేజ్‌ వచ్చిందంటే ఆయన, రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్ల కృషే కారణం. ట్రైలర్‌లో రాహుల్‌, రాజేంద్రప్రసాద్‌ల కెమిస్ట్రీ బాగుంది. రాజేంద్ర ప్రసాద్‌ సెట్లో ఉంటే ఓ నటనా నిఘంటువు పక్కన ఉన్నట్లే. విజయ్‌ పెద్ద హీరో కావాలి. దర్శకుడికి మంచి పేరు రావాలి."

-- గోపీచంద్​, హీరో

ప్రతి ఇంట్లో తండ్రీ కొడుకుల మధ్య ఉండే కథను దర్శకుడు ఎంతో చక్కగా చూపించారని అన్నారు గోపీచంద్​ మలినేని. కొడుక్కి కోపం వచ్చి తండ్రిని చదువుకోవడానికి పంపడమనే అంశం బాగా నచ్చిందని చెప్పారు.

హీరో రాహుల్‌కి చెప్పేది ఒకటే అది నువ్వు నీ పని నమ్ముకో అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుందని రామ్ లక్ష్మణ్​ అన్నారు. మేమింత వరకు వచ్చామంటే కారణం ఇదేనని ఆయన తెలిపారు.

"ఇంత మంచి చిత్రాన్ని తెలుగు, తమిళంలో చేయడానికి అవకాశమిచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు. చదవడం గొప్పా.. చదివించడం గొప్పా అనే కథాంశానికి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ముడిపెట్టి దర్శకుడు ఓ మంచి చిత్రాన్ని చూపించారు. ఇది నా కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ చిత్రమవుతుంది."

-- రాహుల్‌ విజయ్,​ హీరో

ఏ నటుడైనా నటిస్తున్నంత కాలం సంతోషంగా ఉంటాడు. ఒక తండ్రిని కొడుకు ఎందుకు చదివించాడనేది ఇందులో ఆసక్తికరమని రాజేంద్ర ప్రసాద్​ చెప్పారు.

ఇదీ చదవండి: ఆ ఫేస్​బుక్​ ఫొటోయే శ్రద్ధాను హీరోయిన్​ చేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.