ETV Bharat / sitara

విజయ్​ 'లైగర్'​ రికార్డు​.. కార్తికేయ ఫస్ట్​లుక్​ - మహేశ్​ మేనల్లుడి కొత్త సినిమా అప్డేట్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. విజయ్​ దేవరకొండ 'లైగర్'​, హీరో మహేశ్​ బాబు మేనల్లుడి కొత్త సినిమా సహా నితిన్​, కార్తికేయ చిత్రాల అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Jun 20, 2021, 2:55 PM IST

మిమల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. ఇందులో విజయ్​ దేవరకొండ 'లైగర్'​, హీరో మహేశ్​ బాబు మేనల్లుడి కొత్త సినిమా సహా నితిన్​, కార్తికేయ చిత్రాల వివరాలు ఉన్నాయి.

తొలి సినిమాగా రికార్డు

రౌడీహీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarkonda), దర్శకుడు పూరీ జగన్నాథ్‌(Purijagannadh) కాంబోలో తెరకెక్కుతున్న పాన్​ ఇండియా చిత్రం 'లైగర్'(Liger). ఈ క్రేజీ ప్రాజెక్ట్​పై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలవ్వకముందే ఓ రికార్డును అందుకుంది. ఈ మూవీ ఫస్ట్​ లుక్​ పోస్టర్​ ఇన్​స్టాలో 2మిలియన్స్​ లైక్స్​ను అందుకుంది. దక్షిణాది సినిమాల్లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా ఘనత సాధించింది.

కిక్‌ బాక్సింగ్‌ కథతో రూపొందుతోన్న 'లైగర్​' సినిమాలో విజయ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అనన్య పాండే హీరోయిన్​. కరణ్​జోహార్​(Karan Johar) నిర్మాత నటి ఛార్మి(charmi) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

liger
లైగర్​

షూటింగ్​ పూర్తి

'అంధాధున్'(Andhadun) తెలుగు రీమేక్​ 'మాస్ట్రో' షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్వీట్​ చేసింది. యువ కథానాయకుడు నితిన్(Nithin), నభా నటేష్​ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్​ అభిమానులను ఆకట్టుకుంది.

నితిన్‌ ఇదివరకెప్పుడూ చేయని ఓ విలక్షణ పాత్రను ఇందులో పోషిస్తున్నారు. పరిశ్రమ వర్గాలతోపాటు నితిన్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'భీష్మ' చిత్రానికి స్వరాలు సమకూర్చిన మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకూ బాణీలు అందిస్తున్నారు.

maestro
మాస్ట్రో

టైటిల్​ టీజర్​ రిలీజ్​ డేట్​

సూపర్​స్టార్ మహేశ్​బాబు(Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతోనే అశోక్​ తెరంగేట్రం చేయనున్నాడు. జూన్​ 23న ఈ చిత్ర టైటిల్​ టీజర్​ను విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్​గా నిధి అగర్వాల్ నటిస్తోంది. జిబ్రాన్​ స్వరాలు సమాకూర్చనున్నాడు. పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్​ పోస్టర్​ అభిమానులను అలరించింది.

ashok galla
అశోక్​ గల్లా కొత్త సినిమా

టైటిల్​ రిలీజ్​

హీరో కార్తికేయ(Karthikeya) నటిస్తున్న కొత్త సినిమా టైటిల్​ను ప్రకటించారు. 'రాజా విక్రమార్క'గా టైటిల్​ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్​ను దర్శకుడు సందీప్​ వంగా విడుదల చేశారు. యాక్షన్​ బ్యాక్​డ్రాప్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీకేయ ఎన్ఐఏ ఆఫీసర్​గా కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాన్యా రవిచంద్రన్​ కథానాయిక. ప్రశాంత్​ ఆర్​ విహారి సంగీతం అందించనున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్​ పతాకంపై 88 రామా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

karthikeya
కార్తికేయ కొత్త సినిమా టైటిల్​

ఇదీ చూడండి: Raai Laxmi: ధూమ్​ ధామ్​ గున్నది చేప కళ్లసుందరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.