ETV Bharat / sitara

'బాలు'.. మీ ఖ్యాతి ఎప్పటికి సజీవమే - sp balu news

ఎస్పీ బాలు మృతిపై విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ కథానాయకులు, దర్శకులు.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్​లు పెట్టారు.

SP Balasubrahmanyam
cinema fraternity mourn SP Balasubrahmanyam's demise
author img

By

Published : Sep 25, 2020, 5:38 PM IST

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. కె. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, రవితేజ, నాని, అక్షయ్‌ కుమార్‌, సల్మాన్​ఖాన్ తదితరులు సంతాపం తెలిసిన వారిలో ఉన్నారు.

నా ప్రియమైన బాలు.. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది.. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి.. రాగాలన్నీ మూగబోయాయి.. నువ్వు లేని లోటు తీర్చలేనిది!! -కె. రాఘవేంద్రరావు, దర్శకుడు

sp balu raghvendra rao
రాఘవేంద్రరావుతో ఎస్పీ బాలు

ప్రపంచ సంగీతానికి ఇది చీకటి రోజు. మ్యూజిక్‌ లెజెండ్‌ ఎస్పీ బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నా కెరీర్‌ విజయంలో బాలు గారి స్వరం పాత్ర ఎంతో ఉంది. ఆయన నా కోసం ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. ఘంటసాల గారి తర్వాత ఈ సంగీత ప్రపంచాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారా?.. అనే తరుణంలో ఓ తారలా బాలు గారు మ్యూజిక్‌ గెలాక్సీలోకి అడుగుపెట్టారు. భాష, ప్రాంతం, హద్దులు.. అనేవి లేకుండా పలు దశాబ్దాలుగా ఆయన మధుర గాత్రం భారత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అలరిస్తోంది. భవిష్యత్‌లో మరో బాలసుబ్రమణ్యం రాడు.. కేవలం ఆయన పునఃజన్మ మాత్రమే ఆ లోటును భర్తీ చేయగలదు. ఆయన మరణ వార్త విని, నా గుండె పగిలింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాలు గారు. -చిరంజీవి

16 భాషల్లో 40 వేలకిపైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిష్క్రమణ యావత్‌ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలు, నా పాటలు వినని రోజంటూ ఉండదు. ముఖ్యంగా ‘భైరవ ద్వీపం’లో ఆయన ఆలపించిన ‘శ్రీ తుంబుర నారద నాదామృతం’ పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. -బాలకృష్ణ

spb with balakrishna
ఎస్పీ బాలుతో బాలకృష్ణ

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్‌లో హిట్లుగా నిలిచిన ‘ప్రేమ’, ‘పవిత్రబంధం’ వంటి సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మీ ఖ్యాతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.. -వెంకటేశ్‌

sp balu with venkatesh
వెంకటేశ్​తో ఎస్పీ బాలు

‘బాలు సర్‌.. గత కొన్నేళ్లుగా మీరు నా స్వరం అయ్యారు. మీ జ్ఞాపకాలు, మీ స్వరం నాతో ఎప్పటికీ ఉంటాయి. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నా.. -రజినీకాంత్

బాలు గారితో ముచ్చట్లు, ఆయన జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చే సరికీ కన్నీరు ఆగడం లేదు. నా సినిమా ‘అన్నమయ్య’ విడుదలైన తర్వాత ఆయన ఫోన్‌ చేశారు. అప్పుడన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. నా జీవితంలో ఆయన ఓ భాగం అయ్యారు. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో..! -నాగార్జున

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌ గురించి తెలిసిన తర్వాత నా గుండె పగిలింది. మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. -సల్మాన్​ఖాన్

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇకలేరనే చేదు వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన అమృత స్వరానికి మరొకటి సాటి రాదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌. మీ స్వరం జీవంతోనే ఉంటుంది. ఇటువంటి కష్ట సమయాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. -మహేశ్​బాబు

తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకుపైగా 16 భాషల్లో 40 వేలకుపైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇక లేరనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే. -జూ.ఎన్టీఆర్

బాలసుబ్రమణ్యం జీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని నెలల క్రితం ఓ కాన్సర్ట్‌ కోసం బాలసుబ్రమణ్యం గారితో ఆన్‌లైన్‌లో మాట్లాడా. ఆయన చాలా ఆరోగ్యంగా ఎప్పటిలాగే కనిపించారు. నిజంగా జీవితాన్ని మనం ఊహించలేం.. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నా. -అక్షయ్ కుమార్

spb with akshay kumar
ఎస్పీ బాలుతో అక్షయ్ కుమార్

నా హృదయం లక్షలాది పాటలుగా మారి ముక్కలైంది. నేను బాలు గారితో కలిసి షూట్‌లో ఉన్నప్పుడు బాబు జున్నును తీసుకుని సెట్‌కు రమ్మని నా భార్య అంజుకు చెప్పా. లెజెండ్‌ బాలుతో దిగిన ఫొటో జున్ను జ్ఞాపకాల్లో ఉండాలి అనుకున్నా. -నాని

nani with sp balu
ఎస్పీ బాలుతో నాని కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.