ETV Bharat / sitara

ఈ 'హనీ'కి 'దేవసేన' అంటే ఇష్టమట!

author img

By

Published : Jul 4, 2021, 8:46 AM IST

'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్​ మెహ్రీన్ కౌర్​ పీర్​జాదా. ఆ సినిమా విజయంతో నటిగా ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ప్రస్తుతం 'ఎఫ్​ 2' సీక్వెల్​లో నటిస్తున్న మెహరీన్​.. తన ఇష్టయిష్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Chit Chat with Actress Mehreen Kaur Pirzada
ఈ 'హనీ'కి 'దేవసేన' అంటే ఇష్టమట!

'హనీ ఈజ్‌ ద బెస్ట్‌' అంటూ 'ఎఫ్‌2' చిత్రంలో సందడి చేసి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది నటి మెహ్రీన్‌ పీర్‌జాదా. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చానని చెప్పే ఈ పంజాబీ భామ.. ప్రసుత్తం 'ఎఫ్‌3'లోనూ సందడి చేయనుంది. ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాల గురించి వివరిస్తోందిలా..

Chit Chat with Actress Mehreen Kaur Pirzada
మెహ్రీన్ కౌర్

సినిమా ఆలోచన లేదు

మాది పంజాబ్‌. మా కుటుంబంలో ఓ ఐఏఎస్‌ అధికారి ఉండేవారు. దాంతో నాన్నకు నన్ను ఐఏఎస్‌ చేయాలని ఉండేది కానీ నాకు మాత్రం ఓ లక్ష్యం అంటూ ఉండేది కాదు. ఇంజినీర్‌, డాక్టర్‌, ఆర్కిటెక్ట్‌.. ఇలా ఎవరిని కలిసినా వారిలా అవ్వాలనుకునేదాన్ని. అంతెందుకు ఓసారి దలైలామా గురించి తెలిసి ఆయనలా నేనూ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించా. అంతేతప్ప సినిమా రంగంవైపు మాత్రం రావాలనుకోలేదు.

మొదటి అవకాశం ఎలాగంటే..

నాకు పదేళ్లున్నప్పుడు ఓ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నా. కొన్నాళ్లకు కెనడాలో ఓ అందాల పోటీలో పాల్గొని 'మిస్‌ పర్సనాలిటీ'గా గుర్తింపు తెచ్చుకున్నా. తర్వాత అడపాదడపా ప్రకటనలు చేయడం వల్ల సినిమా రంగంలోకి రావాలని పించింది. అలాంటి సమయంలో 'సరైనోడు' ఆడిషన్‌కు వచ్చా కానీ కొన్నికారణాల వల్ల ఆ సినిమా చేయలేదు. చాలా తక్కువ సమయంలోనే మళ్లీ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో ఛాన్స్‌ వచ్చింది. తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే.. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు అమ్మ ప్రోత్సహించింది కానీ నాన్న నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మాత్రం నాన్న 'ఏ సినిమా చేస్తున్నావు.. షూటింగ్‌ ఎక్కడ ఉంది..' అంటూ అడుగుతుంటారు.

ఆ డాక్టర్‌ అంటే ఇష్టం

చిన్నప్పుడు ఎవరికైనా సినిమా హీరో లేదా తెలిసిన అబ్బాయిపైన క్రష్‌ ఉంటుంది కానీ నేను మాత్రం మా ఫ్యామిలీ డాక్టర్‌ను ఇష్టపడేదాన్ని. ఆయన చాలా అందంగా ఉండేవారు. ఆ డాక్టర్‌ను ఎప్పుడు కలిసినా 'అంకుల్‌ నాకు మీరంటే ఇష్టం' అని చెప్పేదాన్ని. అలా ఎన్నిసార్లు చెప్పి ఉంటానో కూడా గుర్తులేదు. అప్పుడప్పుడూ అమ్మతో.. 'ఒక్కసారి డాక్టర్‌ దగ్గరకు వెళ్లి హాయ్‌ చెప్పేసి వద్దామా' అని అడిగేదాన్ని కూడా.

నచ్చే నటుడు

సల్మాన్‌ఖాన్‌. అతను వయసులో నాకన్నా చాలా పెద్దవాడని తెలిసిన రోజు ఎంత బాధపడ్డానో నాకు ఇప్పటికీ గుర్తే. సినిమాల్లోకి వచ్చాక తనను కలిసి మాట్లాడాననుకోండి.

అమ్మకు తెలిసేది

ఏదయినా అల్లరి పని చేసి.. అబద్ధం చెప్పేందుకు ప్రయత్నిస్తే అమ్మ వెంటనే కనిపెట్టి మందలించేది. అమ్మకు ఎలా తెలిసిపోయిందబ్బా అని చాలాసార్లు అనుకున్నా కానీ.. అబద్ధం చెప్పినప్పుడు నా ముఖం ఎర్రగా అయిపోయేదట. తమ్ముడేమో నత్తినత్తిగా మాట్లాడేవాడట. అది చూసే మేం అబద్ధం చెబుతున్నామని అమ్మ కనిపెట్టేసేది అన్నమాట.

నచ్చిన ప్రదేశం

అమెరికా. ఇప్పటికీ ఛాన్స్‌ దొరికితే అక్కడికి వెళ్లిపోతుంటా. కొన్నాళ్లు అక్కడ ఉండి చదువుకున్నా కూడా.

ఇష్టం లేకపోతే చేయను

నేను ఏదయినా ఒక పని ప్రారంభించానంటే దాన్ని వందశాతం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తా. ఒకవేళ చేయలేను అనుకున్నా, నాకు ఆసక్తి లేకపోయినా ఆ పనిని అసలు ముట్టుకోను.

దేవసేనలాంటి ఛాన్స్‌..

సినిమాల్లోకి రాకముందు నుంచీ నేను అనుష్కకు అభిమానిని. అనుష్క 'బాహుబలి'లో దేవసేన పాత్ర చేశాక తనకు ఫిదా అయిపోయా. ఒక్కసారి ఆమెతో కలిసి మాట్లాడితే చాలనుకునేదాన్ని. నాకు తెలిసిన దర్శకనిర్మాతల్ని కూడా అనుష్కతో మాట్లాడే అవకాశం కల్పించమని అడిగేదాన్ని. అలాంటిది 'మహానుభావుడు' ప్రివ్యూకు అనుష్క రావడం వల్ల నా కల నెరవేరిందని అనుకున్నా. ఇద్దరం పక్కపక్కన కూర్చుని సినిమా చూస్తున్నామని అర్థంచేసుకోవడానికే నాకు కొంత సమయం పట్టింది.

ఇదీ చూడండి.. Mehreen Marriage: హీరోయిన్ మెహరీన్ పెళ్లి క్యాన్సిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.