"రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలూ సినిమా కళాకారులకు అందించే అవార్డుల సంగతిని మరిచిపోయాయి. ఇకపై రెండు రాష్ట్రాలూ ఆలోచించి సినీ అవార్డుల్ని ప్రకటించి వేడుకల్ని నిర్వహించాలి" అని కోరారు అగ్రకథానాయకుడు చిరంజీవి.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. "కళాకారులకు అవార్డులు గొప్ప ఉత్సాహాన్నిస్తాయి. ప్రభుత్వాలు సినిమా కళాకారులకు అవార్డులు అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది" అని చిరంజీవి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
'ఆచార్య' పూర్తి చేసిన చిరంజీవి.. ఆ సినిమాను ఫిబ్రవరి 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 'గాడ్‌ఫాదర్', 'భోళాశంకర్' సినిమాల షూటింగ్‌లతో ఆయన బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా బాబీ దర్శకత్వంలో నటించనున్నారు.
ఇవీ చదవండి: