ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన శివశంకర్ వర ప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవిగా ఎలా మారారో అని చాలా మందికి సందేహం. ఈ విషయంపై 'ఈనాడు' ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు... నటనను వృత్తిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో చెప్పాడు.
"చిన్నప్పుడు సినిమాలు చూసేవాడిని కాదు. కానీ నటనపై మాత్రం మక్కువ ఉండేది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు స్కిట్లు వేసేవాడ్ని, జ్యోతిలక్ష్మి పాటలకు చిందేసేవాడ్ని. అప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే ఈ వృత్తి ఎందుకు ఎంచుకోకూడదా అని అనిపించింది. మా నాన్న ఒకట్రెండు చిత్రాల్లో నటించారు. ఆయన ఆ విశేషాలు చెపుతుంటే ఆ ఆలోచన కాస్త బలపడింది. అలా నటుడిని కావాలన్న కోరిక పుట్టింది. సావిత్రి, ఎస్వీఆర్ అంటే నాన్నకు చాలా ఇష్టం. వారిపై అలా నాకు అభిమానం ఏర్పడింది. సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వద్దనలేదు. ఏడాది పాటు ప్రయత్నించు, కుదరకపోతే వచ్చేయ్. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. అలా ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటుండగానే నటుడిగా అవకాశలొచ్చాయి" -చిరంజీవి, నటుడు
మెగాస్టార్ నటించిన తాజా చిత్రం 'సైరా'... నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 20న టీజర్ విడుదల చేయనున్నారు.
ఇది చదవండి: అన్నయ్య 'సైరా'కు తమ్ముడు జనసేనాని స్వరం