ETV Bharat / sitara

మెగాస్టార్ బర్త్​డేకు కామన్ డీపీ కాదు.. కామన్ ఎంపీ

హీరో పుట్టినరోజు అనగానే కామన్ డీపీ (డిస్​ప్లే పిక్చర్) రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో ఆనవాయితీగా మారింది. అయితే మెగాస్టార్ పుట్టినరోజుకు దీనికి భిన్నంగా కామన్ మోషన్ పోస్టర్​ తీసుకొస్తారట. ఇందుకోసం చిరంజీవి పీఆర్ టీమ్ ఓ వీడియోను రూపొందించిందట.

కామన్ డీపీ కాదు.. కామన్ ఎంపీ
కామన్ డీపీ కాదు.. కామన్ ఎంపీ
author img

By

Published : Aug 11, 2020, 3:54 PM IST

అభిమాన కథానాయకుడి పుట్టిన రోజు అయితే ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు కేక్‌ కటింగ్‌లు, కటౌట్లకు దండలు, భోజనాలు, పూజలు, అర్చనలు అబ్బో ఓ రేంజిలో ఉండేది. అయితే ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియాలోకి వచ్చేసింది. ట్విట్టర్​లో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చిందా... కామన్‌ డీపీ ట్రెండింగ్‌లో ఉందా? అనే చూస్తున్నారు. వీటికి ఇంకాస్త అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ తీసుకురావాలని చిరంజీవి అభిమానులు చూస్తున్నారట.

హీరో పుట్టిన రోజు అనగానే కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌) రిలీజ్‌ చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిన ఆనవాయితీ. చిరంజీవి పుట్టిన రోజుకు దీనికి కాస్త డెవలప్‌ చేసి కామన్‌ మోషన్‌ పోస్టర్‌ తీసుకొస్తారట. దీని కోసం చిరంజీవి పీఆర్‌ టీమ్‌ ఓ వీడియోను రూపొందించిందట. చిరంజీవి పుట్టిన రోజుకు వారం ముందు అంటే ఆగస్టు 15న దీనిని విడుదల చేస్తారని టాలీవుడ్‌ భోగట్టా. దేశవ్యాప్తంగా పలు ఇండస్ట్రీల్లోని 65 మంది ప్రముఖులతో దీనిని సోషల్‌ మీడియాలో పెట్టించాలని చూస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.