ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం.. ఇలా తను చేసే ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించే దర్శకుడు సుకుమార్. అయితే ఈ స్టార్ డైరెక్టర్‌కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మలయాళ చిత్రం లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేసే బాధ్యతను సుకుమార్‌కు అప్పగించినట్లు ఫిల్మ్ వర్గాల టాక్.
అయితే ఈ అంశంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తూ చిత్రాలు చేసే సుకుమార్ తన సినీ కెరీర్‌లో రీమేక్‌లు చేయలేదు. మరి మెగాస్టార్‌ను దర్శకత్వం వహించే అవకాశం కోసం లూసిఫర్‌ను రీమేక్ చేస్తాడా? లేక ఆయన మార్క్ కథను చెప్పి చిరును ఒప్పిస్తాడా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.
ఇటీవలే సైరా నరసింహారెడ్డితో అఖండ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ తన తర్వాతి సినిమా కొరటాల శివతో చేయనున్నాడు. ప్రస్తుతం సుకుమార్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ చిత్రం తెరకెక్కించనున్నాడు.
ఇదీ చదవండి: స్టైలిష్ స్టార్ ఇలా.. సూపర్‌స్టార్ అలా..