ETV Bharat / sitara

చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్ - CHIRANJEEVI acharya

తన స్నేహితుడు, సహచర నటుడు మోహన్​బాబుతో కలిసి చిరంజీవి సిక్కిం వెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.

CHIRANJEEVI -MOHANBABU SPECIAL TRIP TO SIKKIM
స్నేహితుడితో మెగాస్టార్ చిరంజీవి సిక్కిం టూర్
author img

By

Published : Mar 15, 2021, 3:09 PM IST

Updated : Mar 15, 2021, 3:26 PM IST

'ఆచార్య' షూటింగ్​తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. విహారయాత్రకు వెళ్లారు. తన మిత్రుడు, సీనియర్ కథానాయకుడు మోహన్​బాబుతో కలిసి సిక్కింకు పయనమయ్యారు. వీరిద్దరూ ట్రిప్​కు వెళ్లేందుకు తీసుకున్న ఫొటోను మోహన్​బాబు కుమార్తె లక్ష్మి మంచు ట్వీట్ చేసింది.

"ఇద్దరు మేధావులు సిక్కిం ట్రిప్​కు వెళ్తే ఎంత రచ్చ చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నాకు కొంత ఈర్ష్యగానే ఉంది. మీ ఇద్దరికి సమయం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది" అని లక్ష్మి రాసుకొచ్చింది.

చిరు నటిస్తున్న 'ఆచార్య' ఈ ఏడాది మే 13న థియేటర్లలో విడుదల కానుంది. మోహన్​బాబు ప్రస్తుతం 'సన్నాఫ్ ఇండియా' చిత్రం చేస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి: ఆ చిత్రం కోసం ఒకే డ్రెస్‌ రెండేళ్లు వేసుకున్న చిరు!

Last Updated : Mar 15, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.