Chiranjeevi: సినిమా టికెట్ల ధరలపై రెండు, మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్యలను రెండువైపులా తెలుసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షించారని... సినిమా టికెట్లపై పునరాలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు.. ఉభయులకూ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారని చిరంజీవి పేర్కొన్నారు. సీఎం జగన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
Megastar Chiranjeevi on movie tickets issue: సినీ పరిశ్రమ కష్టాలు త్వరలోనే పరిష్కారమవుతాయని భావిస్తున్నామని చిరంజీవి అన్నారు. సినీపరిశ్రమలో ఎవరూ కూడా మాటలు జారవద్దని కోరారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు కమిటీ సమావేశానికి త్వరలో వస్తామని చిరంజీవి అన్నారు. టికెట్ రేట్లపై ఇచ్చిన ఉత్తర్వులు పునఃపరిశీలిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. 2 నుంచి 3 వారాల్లోగా కొత్త జీవో విడుదల అవుతుందని.. చిరంజీవి ధీమా వ్యక్తంచేశారు.
‘‘ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. సీఎం నన్ను ఓ సోదరుడిగా పండగ వేళ భోజనానికి ఆహ్వానించి, నాతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చింది. ఆయన సతీమణి భారతిగారూ వడ్డించటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతోన్న నేపథ్యంలో సీఎం గారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ఆయన నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది. సినీ పరిశ్రమలో ఎవరూ మాటలు జారొద్దని కోరుతున్నా. ఎవరూ భయపడవద్దని సీఎం జగన్ ధైర్యం చెప్పారు. ఇచ్చిన జీవోను మళ్లీ పరిశీలిస్తామన్నారు. - చిరంజీవి
ఇదీ చదవండి: