Chiranjeevi acharya movie: మెగాస్టార్ చిరంజీవి అంటే డైలాగ్స్‌లో పవర్, డ్యాన్స్‌లో గ్రేస్ ఉంటుంది. ఈయన హీరోగా 'ఆచార్య'.. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొత్త పాట రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. 'సానా కష్టం' అంటూ సాగే సాంగ్ ప్రోమోను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ స్పెషల్ సాంగ్‌లో రెజీనాతో కలిసి స్టెప్పులేస్తున్న చిరు.. ఆడియెన్స్‌తో గోల పెట్టించేందుకు రెడీ అయిపోతున్నారు. దీని పూర్తిపాట.. సోమవారం సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ కానుంది.
'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరుతో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేశారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
మరోవైపు సూర్య 'ఈటీ' మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫిబ్రవరి 4న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఇవీ చదవండి: