ETV Bharat / sitara

కీర్తి, కియారాలతో రామ్​చరణ్ రొమాన్స్​? - mahesh babu role in acharya movie

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్​చరణ్​ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చెర్రీకి జోడీ కోసం కీర్తి సురేశ్​, కియారా అడ్వాణీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Chiranjeevi Acharya Are makers in talks with keerthy Suresh, kiara Advani for key role opposite Ram Charan?
కీర్తి, కియారా
author img

By

Published : Jul 13, 2020, 9:43 PM IST

Updated : Jul 13, 2020, 10:11 PM IST

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో చిరు సరసన కాజల్​ అగర్వాల్​ నటించనుంది. ఇదివరకు ఈ పాత్రకు త్రిషను అనుకున్నప్పటికీ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఈ క్రమంలోనే కాజల్​ ఆ స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా, అతిథి పాత్రలో కనిపించనున్న రామ్​చరణ్​కు జోడీగా చిత్ర నిర్మాతలు కీర్తి సురేశ్​, కియారా అడ్వాణీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

ఈ మూవీలో ఐటెమ్​ సాంగ్​ కోసం పాపులర్​ యాంకర్​ అనసూయను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అతిథి పాత్రకోసం సూపర్​స్టార్​ మహేశ్ బాబును అడగ్గా.. వ్యక్తిగత కారణాల వల్ల నిరాకరించారు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రామ్​ చరణ్​ నక్సలైట్​గా 30 నిమిషాల పాటు కనిపించనున్నారట.

ప్రస్తుతం రామ్​చరణ్​ ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్'​లో నటిస్తున్నారు. మెగాస్టార్​ 'ఆచార్య' సినిమా తర్వాత మలయాళ సూపర్​హిట్​ చిత్రం 'లూసిఫర్'​ రీమేక్​తో రానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:బీచ్​లో 'భౌతిక దూరం' పాటిస్తున్న సన్నీ లియోని

Last Updated : Jul 13, 2020, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.