ETV Bharat / sitara

నెటిజన్ల సాయం కోరిన గాయని చిన్మయి - Chinmayi urges fans to help her by sending meme page followers

తన గురించి అసభ్యకరంగా మీమ్స్​ క్రియేట్​ చేస్తోన్న పేజీల సమాచారం ఇవ్వాలని నెటిజన్లను సాయం కోరారు ప్రముఖ గాయని చిన్మయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కొన్ని స్క్రీన్​షార్ట్స్​ తీసి పంపిస్తున్నారు. వాటిని ఆమె ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తున్నారు.

chinmayi
చిన్నయి
author img

By

Published : May 31, 2020, 8:11 PM IST

ప్రముఖ గాయని చిన్మయి నెటిజన్లను ఓ సాయం కోరారు. తన గురించి అసభ్యకరంగా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తోన్న పేజీల సమాచారం ఇవ్వాలని అడిగారు. "మీ అందరి నుంచి ఓ సాయం కోరుతున్నా. మీరు మీమ్‌ పేజీల ఫాలోవర్స్‌ అయితే నా గురించి అసభ్యకరంగా ఏమైనా మీమ్స్‌, కామెంట్స్ చూసి ఉంటే ఆ స్క్రీన్‌షార్ట్స్‌ దయచేసి పంపించండి. మీకు సంబంధించిన వివరాలను నేను ఎక్కడా బయటపెట్టను. తెలుగు సోషల్‌మీడియా మీమ్స్‌ పేజీలను ఎక్కువగా నేను ఫాలో అవ్వను. దీనితో పాటు నటీమణుల గురించి ఏమైనా అసభ్యకరమైన సమాచారం చూస్తే అది కూడా పంపించండి. ధన్యవాదాలు" అని చిన్మయి తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు కొన్ని స్క్రీన్​షార్ట్స్​ తీసి‌ పంపిస్తున్నారు. వాటిని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

ఎన్నో చిత్రాల్లో మధురమైన పాటలు పాడి చిన్మయి ప్రేక్షకులను అలరించారు. గాయనిగానే కాకుండా సమంత నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్‌ చెప్పారు. సమంత కథానాయికగా పరిచయమైన 'ఏ మాయ చేసావె' చిత్రానికి గాను 2010లో బెస్ట్‌ ఫిమేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చిన్మయి నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల ఆమె అలపించిన '96', 'జాను' చిత్రాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతేడాది విడుదలైన '96' చిత్రంలోని 'కాదలే కాదలే' పాట ఆమెకు ఎన్నో అవార్డులను అందించింది.

ఇదీ చూడండి : 26 ఏళ్లపుడు క్రష్ ఉంది.. మ్యాగీ చేస్తా: మహేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.