బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందరో యువ కథానాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి అమితాబ్.. యువ కథానాయకుడు రణ్‌బీర్ కపూర్‌కు బిగ్ ఫ్యాన్(Amitabh Bachchan and Ranbir Kapoor relation). సోషల్ మీడియా ద్వారా తన అభిమానాన్ని ఎప్పటికప్పడూ చాటుకునే బిగ్‌బీ.. రణ్‌వీర్‌కు ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
![Amitabh Bachchan, Ranbir Kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13023968_1.jpg)
2014లో రణ్‌బీర్‌కు (Ranbir Kapoor Brahmastra) రిచర్డ్ మిల్లె ఆర్ఎం 010 వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు బిగ్‌బీ. ఆ వాచ్ విలువ రూ.50 లక్షలు. ఖరీదైన వాచ్‌లు, కార్లు వంటి వస్తువుల పట్ల మక్కువ ఉన్న రణ్‌బీర్‌కు ఆ వాచ్ ఎంతగానో నచ్చింది. అయితే రణ్‌బీర్‌కు బిగ్‌బీ అంత ఖరీదైన వాచ్ ఇవ్వడం వెనుక ఓ కారణం ఉంది.
![Richard Mille RM 010 వాచ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13023968_2.jpg)
బిగ్బీట 'భూత్నాథ్ రిటర్న్స్' సినిమాకు మద్దతిచ్చాడు రణ్‌బీర్. అలాగే ఈ ఈవెంట్‌కు అమితాబ్ ఆ వాచ్ పెట్టుకుని వచ్చారు. అది చూసిన రణ్‌బీర్.. బిగ్‌బీ స్టైల్‌ను ప్రశంసించాడు. దీంతో ఆ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన అమితాబ్.. భూత్నాథ్ సినిమాను ప్రమోషన్ చేసినందుకు కృతజ్ఞతగా.. 2014లో ఆర్ఎం 010 వాచ్‌ను రణ్‌బీర్‌కు బహుకరించారు.
ప్రస్తుతం వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' (Amitabh Bachchan Brahmastra)సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: 'అన్నాత్తే' ఫస్ట్‌లుక్ అదుర్స్.. 'ఖిలాడి' సాంగ్ వచ్చేసింది