ETV Bharat / sitara

chaysam divorce: రియల్​లైఫ్​లో 'హిట్'​ కొట్టని స్టార్​ కపుల్స్​ - నాగచైతన్య సమంత

టాలీవుడ్​ స్టార్​ కపుల్​ నాగచైతన్య-సమంత(chaysam divorce) ఇటీవల విడిపోయి అభిమానులను షాక్​కు గురిచేశారు. అయితే ఇందుకు కారణం మాత్రం చెప్పలేదు. వీళ్లే కాదు గతంలో వివిధ కారణాలతో పలువురు స్టార్​ కపుల్స్​, ప్రేమ జంటలు కూడా విడిపోయారు. వారి గురించే ఈ కథనం..

celebrities
సెలబ్రిటీలు
author img

By

Published : Oct 19, 2021, 1:33 PM IST

నాగచైతన్య, సమంత విడిపోయారు(chaysam divorce).. అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. వాళ్లు కలిసి ఉండాలనీ, తెరపై మళ్లీ జంటగా నటించాలనుకున్న వాళ్లకు ఈ వార్తలు, తదనంతర పరిణామాలు బాధ కలిగించాయి. కలిసి ఉండలేనప్పుడు విడిపోవటమే మంచిదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు కారణాలపై మాత్రం ఇరువురూ నోరు విప్పలేదు. వీళ్లే కాదు.. వివిధ కారణాలతో వేరుపడ్డ సాత్​ఇండియా సినిమా జంటలు చాలానే ఉన్నాయి. వాళ్లెవరు? ఎందుకు విడిపోయారో చూద్దాం!

chaysam divorce
నాగచైతన్య సామ్​

నయనతార- ప్రభుదేవా

ఈ స్టార్‌ జంటది పదమూడేళ్ల ప్రేమకథ. చాలా ఏళ్లపాటు ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచారు. 2000 సంవత్సరంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ప్రభుదేవాకి అప్పటికే రమాలత్‌తో పెళ్లైంది. మొదట్లో మేం ‘జస్ట్‌ ఫ్రెండ్స్‌’ అనేవాళ్లు. అంతకుమించి ఉందని మీడియా వార్తలు రాస్తూనే వచ్చింది. ‘నయన్‌ నా భర్తను వెంట తిప్పుకుంటోంది. వాళ్లిద్దరి మధ్య సంబంధంతో ప్రభుదేవా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు’ అంటూ రమాలత్‌ ఫిర్యాదు కూడా చేశారు. చివరికి ఆమె చెప్పిందే నిజమైంది. రమాలత్‌, ప్రభుదేవా 2010లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. నయనతారని పెళ్లి చేసుకుంటాడని అభిమానులు ఎదురుచూసినా ఏడాదిన్నరపాటు సహజీవనం చేశాక మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

chaysam divorce
ప్రభుదేవా నయనతార

రష్మిక - రక్షిత్‌ శెట్టి.. నిశ్చితార్థంతోనే కట్‌

రష్మిక తెలుగువాళ్లకి పరిచయం కాకముందే కన్నడంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరంగేట్ర సినిమా ‘కిరిక్‌ పార్టీ’ చేస్తున్నప్పుడే హీరో రక్షిత్‌తో నిండా ప్రేమలో మునిగిపోయింది. జులై 2017లో ఈ జంట ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. ఇద్దరిది చూడచక్కని జంట అని అభిమానులతో సహా అంతా అనుకున్నారు. ఈలోపు ఇద్దరు సినిమాల్లో బిజీ కావడంతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. మధ్యలో ఏమైందో తెలియదుగానీ ఏడాది తర్వాత బంధానికి బై చెప్పుకున్నారు. ఫ్యాన్స్‌ నిరాశలో మునిగిపోయారు. ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోతున్నామని ప్రకటించారు. ఇదంతా రష్మిక వల్లే జరిగిందని రక్షిత్‌ అభిమానులు మందన్నని తీవ్రంగా విమర్శించారు. ట్రోల్‌ చేశారు. ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వమని రక్షిత్‌ ఫ్యాన్స్‌ని కోరాడు.

chaysam divorce
రష్మిక-రక్షిత్​శెట్టి

అమలా పాల్‌-ఏఎల్‌ విజయ్‌

అమలా పాల్‌, విజయ్‌.. 2011లో ‘దేవ తిరుమగల్‌’ సినిమాకి కలిసి పని చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. మూడేళ్లపాటు వీరి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఎన్నోసార్లు కెమెరాల కంట్లో పడ్డా ‘అబ్బే.. మా మధ్య ఏం లేదు’ అని చెబుతూ వచ్చారు. 2014లో ఇద్దరికీ స్టార్‌ హోదా వచ్చాక చివరికి అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆదర్శ జంట అని పేరు కూడా తెచ్చుకున్నారు. మూడేళ్ల ప్రేమ తర్వాత మూడు ముళ్ల బంధం మూడేళ్లయ్యాక ముగిసింది. ‘ఒకరిపై ఒకరికి నమ్మకం లేకనే మేం విడిపోతున్నాం’ అని విజయ్‌ ప్రకటించాడు. అమలా, విజయ్‌ల మధ్య కలతలు చెలరేగడానికి ధనుష్‌ కారణమని విజయ్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత ఏఎల్‌ అళగప్పన్‌ ఆరోపించాడు.

chaysam divorce
అమలాపాల్​-ఏఎల్​ విజయ్​

ప్రియదర్శన్‌- లిజీ

నటి లిజీ తెలుగువాళ్లకీ సుపరిచితమే. మంచి నటి.. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 24ఏళ్ల తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టి పెద్దవాళ్లు అయిన తర్వాత ఈ జంట విడిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అని అంటే వాళ్లు చెప్పిన సమాధానం కలిసి ఉండటానికి ‘అహం’ అడ్డొచ్చిందని చెప్పడమే విచిత్రం.

chaysam divorce
ప్రియదర్శన్​-లిజీ

కమల్‌ హాసన్‌- గౌతమి

దక్షిణ భారత సినిమా పరిశ్రమలో విడిపోయిన స్టార్‌ జంటలో ముందు చెప్పుకోవాల్సింది కమల్‌ హాసన్‌, గౌతమిల గురించి. కమల్‌ వాణీ గణపతి, సారికలతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు నటి గౌతమితో దాదాపు పదేళ్లపాటు అనుబంధం కొనసాగించారు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ విడిపోయారు. ‘నేను కమల్‌తో విడిపోవడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద బాధాకర నిర్ణయాల్లో ఒకటి’ అని ప్రకటించారు గౌతమి.

chaysam divorce
కమల్​హాసన్​ గౌతమి

వీరే కాదు, పవన్‌కళ్యాణ్‌- రేణూ దేశాయ్‌, మంచు మనోజ్‌- ప్రణతి, సుమంత్‌- కీర్తి రెడ్డి, నోయల్‌-ఏస్తర్‌, సైతం ప్రేమించి, పెళ్లాడి విడిపోయారు. కథానాయిక మెహరీన్‌-బిష్ణోయ్‌, అఖిల్‌-శ్రియా భూపాల్‌ లు నిశ్చితార్థం తర్వాత వివాహాన్ని వద్దనుకున్నారు.

ఇదీచూడండి: 'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.