ETV Bharat / sitara

చైతూతో విడాకులు.. ఈ సారి సామ్ ఏం చెప్పిందంటే? - samantha pushpa song

Chaysam Divorce: నాగచైతన్యతో విడాకుల అంశంపై మరోసారి మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పారు హీరోయిన్​ సమంత. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

సమంత విడాకులు, chay sam divorce
సమంత విడాకులు
author img

By

Published : Dec 12, 2021, 12:04 PM IST

Chaysam Divorce: నాగచైతన్యతో విడాకుల అంశంపై మళ్లీ మళ్లీ మాట్లాడటం తనకు ఇష్టం లేదని నటి సమంత తెలిపారు. ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్‌.. తన విడాకుల వ్యవహారంపై స్పందించారు. విడిపోయిన సమయంలో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, చనిపోవాలనుకున్నానని ఆమె అన్నారు. 2021.. తనకు వ్యక్తిగతంగా కలిసి రాలేదని ఆమె తెలిపారు. కాగా, ఇప్పుడు మరోసారి తన విడాకుల విషయమై స్పందించారు సామ్​.

"మేమిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆ మొత్తం వ్యవహారంపై నా అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పేశాను. కాబట్టి, ఇప్పుడు మళ్లీ మళ్లీ ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను" అని సమంత పేర్కొన్నారు.

'ఏమాయ చేసావే' చిత్రంతో పరిచయమైన సామ్‌-చై కొన్ని సంవత్సరాల తమ ప్రేమ అనంతరం 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు, ప్రస్తుతం సామ్‌ వరుస సినిమాలు ఓకే చేస్తున్నారు. 'యశోద', 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌'లకు పచ్చజెండా ఊపిన ఆమె, బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు ఓకే చేసినట్లు సమాచారం. 'పుష్ప'లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేశారు. ఇది అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఊ అంటావా మావ.. '.. ఫిదా చేస్తున్న సామ్​ హాట్​లుక్స్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.