విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్ పెట్టేశారు. 'మెర్రీ క్రిస్మస్' పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాత రమేశ్ తౌరుని చెప్పారు.
ఏప్రిల్లోనే మొదలవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్.. కత్రినాకు కరోనా రావడం వల్ల నిలిచిపోయింది. ఆ తర్వాత సెకండ్ వేవ్ ప్రభావంతో షూటింగ్లు ఆగిపోయాయి. అయితే జూన్లో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు నిర్మాత రమేశ్ తెలిపారు.
ఇదే కాకుండా విజయ్ సేతుపతి 'ముంబయికర్', 'గాంధీ టాక్స్', రాజ్-డీకే దర్శకత్వంలో వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ కూడా కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">