హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'చాణక్య'. మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రామకృష్ణ అనే బ్యాంక్ ఉద్యోగి, అర్జున్ శ్రీకర్ అనే రా ఏజెంట్ పాత్రల్లో సందడి చేయనున్నాడీ కథానాయకుడు. పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోందీ సినిమా.
'మీరు రా(RAW)ను లెఫ్ట్ నుంచి రైట్‌కు చదువుతారు. మేం రైట్ నుంచి లెఫ్ట్‌కు చదువుతాం. అప్పుడు రా.. వార్ అవుతుంది', 'చావుకు తెగించినోడు బులెట్‌కు భయపడడు' అనే డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించాడు. ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు. తిరు దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వమని.. బతిమాలా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్