మలయాళ చిత్రం 'వర్ధమానం'కు సెన్సార్ బోర్డులో చుక్కెదురైంది. ఈ సినిమాను విడుదల చేయడానికి అక్కడి(కేరళ) సీబీఎఫ్సీ బోర్డు నిరాకరించింది. ఈ విషయంపై చిత్రనిర్మాత ఆర్యాదన్ శౌకత్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రివైజింగ్ కమిటీని ఆశ్రయిస్తానని తెలిపారు. కాగా, ఈ చిత్రం ఒక జాతికి వ్యతిరేకంగా ఉందని, అందుకే విడుదులకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు సెన్సార్ బోర్డు కమిటీ సభ్యుడు సందీప్ కుమార్.

సినిమా కథాంశం
ఈ ఏడాది జనవరిలో కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోకి చరొబడి కర్రలు, రాడ్లతో విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇదంతా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ అల్లర్ల ఆధారంగానే 'వర్ధమానం' చిత్రాన్ని తెరకెక్కించారు సిద్దార్థ్. ఇందులో ప్రముఖ నటి పార్వతి నటించారు.
ఇదీ చూడండి : జేఎన్యూలో నిశ్శబ్దం- దేశవ్యాప్తంగా కదం తొక్కిన విద్యార్థి లోకం