ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పర్యవేక్షణలో రూపొందిన 'దిశ ఎన్‌కౌంటర్' సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించింది. సినిమా కథాంశంపై బోర్డు అభ్యంతరం తెలిపింది. సున్నితమైన అంశం కావడం వల్ల అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు తీరుపై నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీని ఆశ్రయించారు. రివిజన్ కమిటీలోని నలుగురు సభ్యులు సినిమా పూర్తిగా చూశాక నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర శివారులో 'దిశ' అనే యువతిపై కొంతమంది యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనంద్ చంద్రా డైరెక్టర్. శ్రీకాంత్, సోనియా, ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19న సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తుండగా...సెన్సార్ బోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">