ETV Bharat / sitara

దొరస్వామిరాజు కన్నీటి వీడ్కోలు.. సినీప్రముఖుల నివాళి - దొరస్వామిరాజుకు నివాళులర్పించిన సినీప్రముఖులు

గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నిర్మాత, వీఎంసీ అధినేతి దొరస్వామిరాజుకు తెలుగు చలన చిత్రపరిశ్రమ నివాళులర్పించింది. ఈ ఉదయం కేర్ ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్​కు తరలించారు.

Celebrities who paid tribute to producer Doraswamyraju in hyderabad
దొరస్వామిరాజుకు నివాళులర్పించిన సినీప్రముఖులు
author img

By

Published : Jan 19, 2021, 12:00 PM IST

సినీ నిర్మాత దొరస్వామిరాజు మృతి పట్లు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ఉదయం కేర్ ఆస్పత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్​కు తరలించారు. దొరస్వామిరాజు నిర్మాతగా సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి సతీసమేతంగా వచ్చి దొరస్వామిరాజుకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు మురళీమోహన్ ఫిల్మ్ చాంబర్​కు విచ్చేసి దొరస్వామిరాజుకు తుది వీడ్కోలు పలికారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం దొరస్వామిరాజు అంతిమయాత్ర ఫిల్మ్​నగర్ మహాప్రస్థానానికి చేరుకుంది. అక్కడి ఆయన కుమారుడు విజయ్ కుమార్ వర్మ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ చదవండి: రాజ్​భవన్ ఘెరావ్... పోలీసుల అదుపులో వీహెచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.