టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. గుండెపోటు రావడం వల్ల కుటుంబీకులు ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో సంతాపాన్ని ప్రకటించారు.
-
We lost Telugu Cinema’s one of the passionate distributors & producers, VMC Doraswami Raju garu. My condolences to his family. pic.twitter.com/Jlinm9K07b
— Raghavendra Rao K (@Ragavendraraoba) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We lost Telugu Cinema’s one of the passionate distributors & producers, VMC Doraswami Raju garu. My condolences to his family. pic.twitter.com/Jlinm9K07b
— Raghavendra Rao K (@Ragavendraraoba) January 18, 2021We lost Telugu Cinema’s one of the passionate distributors & producers, VMC Doraswami Raju garu. My condolences to his family. pic.twitter.com/Jlinm9K07b
— Raghavendra Rao K (@Ragavendraraoba) January 18, 2021
"నిర్మాత వి.దొరస్వామి రాజు..అజాత శత్రువు, అందరికీ బంధువు. నేను తెరకెక్కించిన ఎన్నో సినిమాలను ఆయనే పంపణీ చేశారు. సీడెడ్‌లో డిస్ట్రిబ్యూటింగ్ రాజుగా ఎదిగాడు. ఆయన నిర్మించిన 'అన్నమయ్య' చిత్రానికి నేను దర్శకత్వం వహించడం వల్ల ఆయనతో ఉన్న అనుబంధాలన్నీ ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా".
- కె.రాఘవేంద్రరావు, దర్శకుడు
-
దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
— Jr NTR (@tarak9999) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
— Jr NTR (@tarak9999) January 18, 2021దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
— Jr NTR (@tarak9999) January 18, 2021
"దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. 'సింహాద్రి' చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను".
- జూనియర్ ఎన్టీఆర్, కథానాయకుడు
మంగళవారం అంత్యక్రియలు
నిర్మాత దొరస్వామిరాజు భౌతికకాయాన్ని రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు తరలించనున్నట్లు ఆయన కుమారుడు విజయ్ కుమార్ వర్మ తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అక్కడ రెండు గంటలపాటు ఉంచనున్నట్లు వెల్లడించారు. అనంతరం మహాప్రస్థానంలో 11 గంటలకు దొరస్వామి రాజు అంత్యక్రియలు జరుపనున్నట్లు చెప్పారు. తన తండ్రి రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రలో చేర్పించినట్లు పేర్కొన్న విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నిర్మాత దొరస్వామి రాజు కన్నుమూత