బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు విచారణను సీబీఐ ప్రారంభించింది. 10 మంది సభ్యులున్న ఈ బృందం ముంబయికి శుక్రవారం చేరుకుంది. కీలక సాక్షి అయిన సుశాంత్ వంటమనిషితో పాటు ఇంట్లో పనిచేసిన మిగతా సిబ్బందిని అధికారులు విచారించారు.
సీబీఐకి చెందిన మరో బృందం.. బాంద్రా పోలీస్ స్టేషన్లో సుశాంత్ కేసు రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా సుశాంత్ ఇంటికి వెళ్లి, ఈరోజే శాంపిల్స్ తీసుకోనున్నారు.
-
Mumbai: CBI team investigating #SushantSinghRajput case, moves from the office of DCP Zone 9 Abhishek Trimukhe, to Bandra Police station. Some documents also being brought to the Police Station. pic.twitter.com/BNe4lRdQbt
— ANI (@ANI) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mumbai: CBI team investigating #SushantSinghRajput case, moves from the office of DCP Zone 9 Abhishek Trimukhe, to Bandra Police station. Some documents also being brought to the Police Station. pic.twitter.com/BNe4lRdQbt
— ANI (@ANI) August 21, 2020Mumbai: CBI team investigating #SushantSinghRajput case, moves from the office of DCP Zone 9 Abhishek Trimukhe, to Bandra Police station. Some documents also being brought to the Police Station. pic.twitter.com/BNe4lRdQbt
— ANI (@ANI) August 21, 2020
జూన్ 14న తన ఇంట్లో ఉరి వేసుకుని సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. నెపోటిజమ్ వల్లే చనిపోయాడని తొలుత అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అతడి ప్రేయసి రియానే సుశాంత్ మరణానికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాట్నాలో ఆమెపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు కూడా పెట్టారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బిహార్ ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది.