'ఇద్దరమ్మాయిలతో..' చిత్రంలో ఆకాంక్షగా మెప్పించి.. తన ఒయ్యారాలతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి కేథరిన్. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, దర్శకుడు క్రాంతిమాధవ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. విజయ్‌కు జోడీగా కేథరిన్‌తో పాటు రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా లైట్ ఆడిపాడారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా గురించి నటి కేథరిన్ పంచుకున్న విశేషాలివే..
అతడి బలం అదే..
"షూటింగ్ ప్రారంభించడానికి ఎనిమిది నెలల ముందు నాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' కథ చెప్పాడు క్రాంతి. ఆ కథాంశం నాకు బాగా నచ్చింది. ప్రతి పాత్ర చాలా కీలకంగా ఉండేలా ఈ స్టోరీ రూపొందించాడు. అప్పుడే అతడు తెరకెక్కించిన 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు', 'ఓనమాలు' సినిమాలు చూశాను. ఆ రెండూ నాకు బాగా నచ్చాయి. క్రాంతిమాధవ్ మంచి రైటర్. అతడి బలమదే"
మార్పులు అవసరం లేదు..
"క్రాంతిమాధవ్ కథ, నా పాత్రను వర్ణించిన తీరు నాకు బాగా నచ్చాయి. కాకపోతే కొంత సమయమివ్వమని అడిగాను. 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఒకరోజు క్రాంతి మాధవ్‌ను కలిసి... 'మీ సినిమాలోని పాత్ర కోసం నన్నే ఎందుకు తీసుకున్నారు' అని నేను అడిగితే.. 'స్మిత.. క్యారెక్టర్‌కు నిన్ను తప్ప వేరేవాళ్లను అనుకోలేకపోతున్నాను' అని చెప్పాడు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే 'ఆ పాత్ర కోసం నేను ఏమైనా మారాలా?' అని క్రాంతిని అడిగాను. 'మార్పులేమీ వద్దు. నువ్వు ఎప్పుడూ ఎలా ఉంటావో అలాగే స్మిత క్యారెక్టర్‌లో నటించు చాలు.' అన్నాడు.
మొదటిసారి అక్కడే కలిశా..
"వరల్డ్ ఫేమస్ లవర్'లో నాతో పాటు మరో ముగ్గురు హీరోయన్లు ఉన్నారు. అయితే ఈ సినిమాలో నేను ఎవరితోనూ కలిసి నటించలేదు. ఐశ్వర్య రాజేశ్ కాకుండా మిగిలిన ఇద్దర్నీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కలిశాను. వారంతా బాగా నటించారు.
నంబర్స్‌తో సంబంధం లేకుండా..
"బాక్సాఫీస్ నంబర్లతో సంబంధం లేకుండా మంచి పాత్రలను పోషించాలనేదే నా లక్ష్యం. అంటే మీరు ఒక సినిమా చూసినప్పుడు 'ఇందులో కేథరిన్ బాగా నటించింది' అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా నా నటన ఉండాలని నేను భావిస్తాను"
అదే ఈ సినిమాకి కీలకం..
"ప్రతి సినిమాలో ప్రేక్షకులను మెప్పించే కీలకమైన అంశం ఉంటుంది. అలాగే ఈ సినిమా కథ ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది. వారిద్దరి మధ్య వచ్చే గొడవలు.. ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చాలా సహజంగా చూపించాడు"
విజయ్‌తో నా సీన్స్..
"ఇందులో నా పాత్ర పేరు స్మిత. బొగ్గుగనిలో అధికారిణిగా కనిపిస్తాను. ఈ పాత్రకు, నాకూ మధ్య చాలా పోలికలున్నాయి. ఈ సినిమాలో నా సన్నివేశాలన్నీ చాలా సరదాగా, సంతోషంగా సాగిపోతాయి. అలాగే విజయ్‌కి, నాకూ మధ్య చిత్రీకరించిన సీన్లు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. విజయ్ మంచి వ్యక్తి. సెట్‌లో చాలా సైలెంట్. తను ఏ పాత్రను పోషిస్తే వెంటనే ఆ పాత్రలోకి ఒదిగిపోతాడు. విజయ్‌లో నాకు ఈ విషయం బాగా నచ్చింది. ఈ సినిమాలో విజయ్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి"
ప్రేమ.. చెప్పడం కష్టం..
"ప్రేమని నమ్ముతాను. కానీ దాని గురించి చెప్పడం కష్టం. అది ఒక మంచి ఫీల్ అని నా అభిప్రాయం."
బోయపాటిని అడగండి..
"ఇటీవల ప్రారంభమైన బోయపాటి- బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానని చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి. ఆ చిత్ర బృందం నన్ను సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే ఈ విషయం గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు. కానీ నేను చెప్పేది ఒక్కటే.. 'బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానో లేదో తెలుసుకోవాలంటే బోయపాటినే అడగండి".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. ఆస్కార్ రేసులో 9 ఉత్తమ చిత్రాలు.. గెలుపెవరిది?