బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్, నిర్మాత సెహర్ అలీ లతీఫ్(Seher Aly Latif) మరణించారు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సెహర్.. సోమవారం గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా సెహర్ లతీఫ్ మూత్రపిండాలు వైఫల్యానికి గురయ్యాయని వైద్యులు వెల్లడించారు. కాస్టింగ్ డైరెక్టర్, నిర్మాతగానే కాకుండా ఆమె ఓ మంచి ఫొటోగ్రాఫర్గానూ గుర్తింపు పొందారు.
'జీరో డార్క్ థర్టీ', 'జూలియా రాబర్ట్స్', నెట్ఫ్లిక్స్ 'సెన్స్ 8' వంటి హాలీవుడ్ చిత్రాలకు సెహర్ లతీఫ్ కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేశారు. దీంతో పాటు బాలీవుడ్లో 'లంచ్ బాక్స్' అనే చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. వీటితో పాటు విద్యాబాలన్ 'శకుంతలా దేవీ'(Shakunthala Devi), అక్షయ్ కుమార్ 'గోల్డ్'(Gold) చిత్రాలకు ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆమె వర్క్ చేశారు.
ఇదీ చూడండి: Most Desirable Women-2020: అగ్రస్థానంలో రియా చక్రవర్తి