దివి, శ్రీహాన్ జంటగా నటించిన చిత్రం 'క్యాబ్ స్టోరీస్'. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.ఎన్.రాజేశ్ దర్శకత్వం వహించారు. స్పార్క్ ఓటీటీ వేదికగా మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'లవ్ రింగ్‌టోన్ ఎదలో మోగేలా' అంటూ సాగే పాట ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దివి, శ్రీహాన్‌పై చిత్రీకరించిన ఈ ప్రేమ పాట ప్రతిఒక్కర్నీ ఆకర్షించేలా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మలయాళ నటుడు టొవినో థామస్, దివ్యా పిళ్లై ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కాలా'. వీఎస్ రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా జూన్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రబృందం.
![Kala release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11877481_cinj.jpg)