ETV Bharat / sitara

'కంచరపాలెం' టీమ్​ నుంచి మరో విభిన్న చిత్రం - వెంకటేశ్ మాహా కొత్త చిత్రం

'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రాలతో అలరించిన దర్శకుడు వెంకటేశ్ మహా. తాజాగా ఇతడి నుంచి మూడో సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన టైటిల్​ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

'కంచరపాలెం' టీమ్​ నుంచి మరో విభిన్న చిత్రం

author img

By

Published : Aug 23, 2020, 9:32 AM IST

'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రాలకు కలిసి పని చేశారు వెంకటేశ్ మహా, పరుచూరి ప్రవీణ. ఈ రెండు సినిమాలకు వెంకటేశ్ దర్శకత్వం వహించాడు. కాగా వీరి నుంచి మరో చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. వీరి పరిచయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు దర్శకుడు వెంకటేశ్ మహా.

'సు మతి' అనే టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'యాన్ ఎంపైర్ స్టేట్ ఆఫ్ మైండ్' అనేది ఉపశీర్షిక. తాజాగా దీనికి సంబంధించిన యానిమేటెడ్ లుక్​ను విడుదల చేశారు. ఇందులో ఓ ముసలావిడ అమెరికాలోని ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ముందు నిలబడి దాని వైపు తదేకంగా చూస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే దర్శకుడు మహా మరోసారి విభిన్న కాన్సెప్ట్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.