ETV Bharat / sitara

చిరు సినిమాలో నయన్ అంత పారితోషికమా? - నయన తార రెమ్యూనరేషన్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా​లో నయనతార(Nayanthara In Godfather) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా ఆమె నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం నయన్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

nayanthara remuniration
నయనతార పారితోషికం
author img

By

Published : Nov 20, 2021, 5:41 AM IST

అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi Godfather Movie) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామా 'గాడ్‌ ఫాదర్‌'. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న 'లూసిఫర్‌' రీమేక్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే హీరో సోదరి పాత్రను తెలుగులో నయనతార(Nayanthara In Godfather) పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 'గాడ్‌ ఫాదర్‌' సినిమా కోసం నయన్‌(Nayanthara In Godfather) తీసుకున్న పారితోషికంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార(Nayanthara In Godfather) రోల్‌ ఎంతో కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇక, సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్‌ ఈ సినిమాలో ఓ కీ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.

ఇదీ చూడండి: RRR Movie: 'ఆర్ఆర్​ఆర్​'లో అజయ్​ దేవ్​గణ్ పాత్ర ఇంతేనా?

ఇదీ చూడండి: 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్ డేట్​​.. గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.