ETV Bharat / sitara

మొదట రిలీజ్​ అయ్యే మూవీ ఇదేనా? - సినిమా వార్తలు

చిత్రీకరణ పూర్తి చేసుకున్న గోపిచంద్​ సినిమాల రిలీజ్​ డేట్స్ మారాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీటీమార్ కన్నా ముందే పక్కా కమర్షియల్​ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనాలు మొదలయ్యాయి.

రిలీజ్ కాబోతున్న గోపిచంద్ సినిమాలు
movie release dates
author img

By

Published : Jun 19, 2021, 10:42 PM IST

కరోనా కారణంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. సినీ అభిమానులు తమ అభిమాన తారల సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం విరామం తర్వాత ఏ సినిమా ముందు వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. గత ఏప్రిల్​లోనే రిలీజ్​ కావాల్సిన గోపిచంద్​ సినిమా 'సీటీమార్​'.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్​డౌన్​ ఎత్తేయగా.. మొదట అదే సినిమా రిలీజ్​ అవుతుందని అందరు అంచనా వేస్తున్నారు. అయితే.. చిత్రీకరణ పూర్తి చేసుకున్న గోపిచంద్​ సినిమాల రిలీజ్​ డేట్స్ మారాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

గోపిచంద్ కథానాయకునిగా 'సీటీమార్'​తో పాటు మరో మూవీ 'పక్కా కమర్షియల్​'లో నటించాడు. అది కూడా చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుంది. అయితే.. 'సీటీమార్​' కన్నా ముందే 'పక్కా కమర్షియల్'​ ప్రేక్షకుల ముందుకు రానుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

సీటీమార్​ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్​గా నటించింది. వీరిద్దరూ కబడ్డీ కోచ్​ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ కథానాయకుడిగా మారుతి తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'పక్కా కమర్షియల్‌'. రాశీ ఖ‌న్నా నాయిక‌. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇదీ చదవండి:Rajinikanth: అమెరికాకు తలైవా పయనం

Telugu cinema: తెలుగులోకి తమిళ హీరోలు.. అస్సలు తగ్గట్లే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.