ETV Bharat / sitara

'బుట్టబొమ్మ' ఖాతాలో మరో మైలురాయి - అల్లు అర్జున్ త్రివిక్రమ్ న్యూస్

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని పాటలు యూట్యూబ్​లో రికార్డులు సృష్టించాయి. తాజాగా 'బుట్టబొమ్మ' సాంగ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.

బుట్టబొమ్మ రికార్డు
బుట్టబొమ్మ రికార్డు
author img

By

Published : May 31, 2020, 3:42 PM IST

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం విడుదలై ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్నా.. నెట్టింట ఆ చిత్ర సందడి ఇంకా కొనసాగుతోంది. ఆ చిత్రంలోని పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వీక్షణలు దక్కించుకుంటూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ముఖ్యంగా ఆ చిత్రంలోని 'బుట్టబొమ్మ..' గీతానికి అందులో బన్నీ వేసిన స్టెప్పులకు నెట్టింట తెగ ఆదరణ దక్కుతోంది. పలువురు బాలీవుడ్‌ తారలు, క్రికెట్‌ క్రీడాకారులు కూడా ఆ పాటకు తమదైన స్టైల్‌లో స్టెప్పులేసి ముచ్చట తీర్చుకున్నారు.

తాజాగా ఈ పాట మరో అరుదైన మైలురాయిని అందుకుంది. యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఈ పాటను ఇప్పటివరకు దాదాపు 200మిలియన్ల మంది వీక్షించారు. అంటే దాదాపు 20 కోట్ల మంది చూశారన్న మాట.

బుట్టబొమ్మ రికార్డు
బుట్టబొమ్మ రికార్డు

ఇటీవల కాలంలో తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోనే ఈస్థాయి ఆదరణ దక్కించుకున్న గీతాల్లో ఒకటిగా నిలిచింది 'బుట్టబొమ్మ' గీతం. ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. అర్మాన్‌ మాలిక్‌ ఆకట్టుకునేలా ఆలపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.