స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తదుపరి చిత్ర షూటింగ్ కోసం స్టైలిష్ స్టార్ థాయ్లాండ్ వెళ్లనున్నాడు. ఈ మధ్యనే గ్రాండ్గా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కొరకు యూనిట్ సభ్యులు థాయిలాండ్ వెళ్లనున్నారట. థాయిలాండ్ లోని దట్టమైన అడవుల నేపథ్యంలో నడిచే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపాలని నిర్ణయించారట సుకుమార్.
గతంలో బన్నీ,సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2చిత్రాలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందాన నటిస్తోంది. ప్రస్తుతం బన్నీ 'అల వైకుంఠపురములో' చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుందీ.
ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్ గాయనుల సందడి