ఆయనను చూడగానే ఎంత కష్టంలో ఉన్నా మనసు ప్రశాంతత పొందుతుంది.. ముఖంపై చిరునవ్వు మొలకెత్తుతుంది.. బాధను మరిపించగల దివ్య ఔషధం ఆయన నటన.. చిన్నా పెద్ద తేడా లేకుండా కితకితలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. వాట్సాప్ రూపొందించిన ఎమోజీలు కూడా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ముందు దిగతుడుపే.. ఆయనే తెలుగు సినీ ప్రేక్షకులకు వరంగా దొరికిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం.
అగ్ర కథానాయకుడు చిరంజీవి వ్యాఖ్యాతగా ఒకప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బ్రహ్మానందం విచ్చేసి 'నవరసాలు' పలికించి కడుపుబ్బా నవ్వించారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు చూసిన ఆ వీడియో ఎవర్‌గ్రీన్. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఆ వీడియోను మరోసారి చూసి ఆస్వాదించండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">