ETV Bharat / sitara

ఆలియా సినిమాకు సోషల్​ మీడియా సెగ - సడక్​ 2 సినిమాను బాయ్​కాట్​

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ ఆలియా భట్​ నటించిన 'సడక్​ 2' సినిమా.. డిస్నీప్లస్​ హాట్​స్టార్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇప్పటికే ఆలియాపై గుర్రుగా ఉన్న నెటిజన్లు ఈ సినిమాను బాయ్​కాట్​ చేస్తామంటూ సోషల్​మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు.

alia
ఆలియా
author img

By

Published : Jun 30, 2020, 8:03 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి సినిమాలను బాయ్​కాట్​ చేస్తామని నిరసనలు తెలుపుతున్నారు.

అయితే ఇదే విధమైన విమర్శలకు గురైన ప్రముఖ హీరోయిన్​ ఆలియా భట్​.. తాను నటించిన 'సడక్​ 2' సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్​ను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. త్వరలోనే ఓటీటీ ప్లాట్​ఫాం డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలియాపై గుర్రుగా ఉన్న నెటిజన్లు.. ఆమెపై మళ్లీ విమర్శలతో విరుచుకుపడ్డారు. సుశాంత్​ మరణానికి తాను ఓ కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను బాయ్​కాట్​ చేస్తామంటూ సోషల్​మీడియాలో తీవ్రంగా ట్రోల్​ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆలియా తండ్రి ప్రముఖ దర్శకుడు మహేశ్​ భట్​పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు గుప్పించారు.

1999లో వచ్చిన 'కార్టూస్'​ చిత్రం తర్వాత మహేశ్ సినిమాలకు దూరమయ్యాడు. ఈ చిత్రంతో మళ్లీ పునరాగమనం చేస్తున్నాడు. 1991లో వచ్చిన 'సడక్'​ సినిమాకు సీక్వెల్​గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన సంజయ్, పూజాభట్.. సీక్వెల్​లోనూ కనిపించనున్నారు. ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇది చూడండి : బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.