ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృవియోగం జరిగింది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ.. శుక్రవారం కన్నుమూశారు. రాత్రి 7.22 గంటలకు స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సీతారావమ్మ వయస్సు 80 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు తుదిశ్వాస విడిచారు.
