నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన కొత్త సినిమాలో అఘోరా పాత్రలో కనిపించనున్నారనే వార్తలు గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ఇంతవరకు మాట్లాడని దర్శకుడు బోయపాటి శ్రీను.. తాజాగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్‌చాట్ సెషన్లో స్పందించారు. బాలయ్య రోల్‌పై స్పష్టతనిచ్చారు.
బాలయ్యతో తను చేసిన గత చిత్రాలు 'సింహా', 'లెజెండ్'లు అద్భుత విజయం సాధించాయని, ఇప్పుడు రాబోతున్న సినిమా వాటికి మించి ఉంటుందని బోయపాటి అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆయన అఘోరా పాత్రలోనే నటిస్తున్నారని చెప్పారు. అయితే ఆ రోల్ ప్రేక్షకుల కన్విన్స్ అయ్యేలా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది.