దర్శకుడు పూరీ జగన్నాథ్ వీరాభిమాని కథతో తీస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'. నందు, రష్మీ జంటగా నటిస్తున్నారు. శుక్రవారం విడుదలైన టీజర్.. నవ్విస్తూనే ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన జీవితాన్ని కథగా రాసి, ఇష్టమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఇవ్వాలనే తాపత్రయం ఉన్న పల్లెటూరి మాస్ కుర్రాడిగా నందు కనిపించనున్నాడు. అతడి ప్రేయసి పాత్రలో రష్మీ నటించింది. 'పోకిరి'లోని డైలాగ్ పౌరాణికంలో చెప్పడం, 'నేను ఆళ్లను కొట్టినా, ఆళ్లు నన్ను కొట్టినా నేను మాత్రం చిరంజీవి మాత్రం మనమే' అంటూ సాగే సంభాషణ ఆకట్టుకుంటోంది.
ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించగా, రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">