బాలీవుడ్ ప్రముఖులు సోనాలి బింద్రే, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, ఏక్తా కపూర్‌తో పాటు సల్మాన్ఖాన్సోదరి అర్పితా ఖాన్ తదితరులు వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కుటుంబంతో పండుగ జరుపుకుంటున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది నిర్మాత ఏక్తా కపూర్. తనకు, తండ్రి జితేంద్రకు తల్లి శోభాకపూర్ బాస్ అయితే.. వినాయకుడు అందరికీ బాస్ అంటూ ట్వీట్ చేసింది.
-
Boss with the bosss of all GANESHCHATURTHI #GanpatiBappaMorya pic.twitter.com/Xk5GUSscZa
— Ekta Kapoor (@ektaravikapoor) September 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Boss with the bosss of all GANESHCHATURTHI #GanpatiBappaMorya pic.twitter.com/Xk5GUSscZa
— Ekta Kapoor (@ektaravikapoor) September 2, 2019Boss with the bosss of all GANESHCHATURTHI #GanpatiBappaMorya pic.twitter.com/Xk5GUSscZa
— Ekta Kapoor (@ektaravikapoor) September 2, 2019
"నాకు ఎంతో ఇష్టమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. గతేడాది ఇదే సమయానికి ఇంట్లో ఉండే అవకాశం రాలేదు. ఈ రోజు నా కుటుంబంతో ఎంతో ఆనందంగా జరుపుకున్నా" అంటూ సోనాలి బింద్రే ట్వీట్ చేసింది.
పర్యావరణానికి హాని కలిగించని వినాయకుడిని పూజించానని చెప్పిన నటి శిల్పాశెట్టి.. కుటుంబంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.
"పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్లాస్టిక్‌ను వాడకుండా పచ్చదనాన్ని పెంచుదాం. గణపతి బొప్పా మోరియా" అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు నటుడు, నిర్మాత వివేక్ ఒబెరాయ్.
సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్.. తన తల్లి సాల్మాఖాన్తో వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తున్న ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది.
ఇదీ చూడండి: మామ పుట్టినరోజు.. అల్లుడు సెలబ్రేషన్