ETV Bharat / sitara

బాలీవుడ్​ హీరో సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌

author img

By

Published : Nov 19, 2020, 7:12 PM IST

ఐసోలేషన్​లో ఉన్న బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​కు తాజా వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్​ వచ్చింది. ఇటీవలే తన వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరు సభ్యులకు కొవిడ్​-19 నిర్ధరణ కావడం వల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు సల్మాన్​. ప్రస్తుతం ఆయన 'రాధే' సినిమాలో నటిస్తున్నారు.

salman corona negitive
బాలీవుడ్​ హీరో సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా నెగెటివ్‌ వచ్చింది. సల్మాన్‌ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ బాలీవుడ్‌ హీరో కుటుంబంతో సహా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. గురువారం సల్మాన్‌ ఖాన్‌ కుటుంబం కరోనా పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కరోనా వచ్చిన సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చిందన్న వార్తతో బాలీవుడ్‌ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఆయన ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-14 హోస్టుగా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు 'రాధే' చిత్రంలోనూ నటిస్తున్నారు. దిశా పటానీ, రణ్‌దీప్ హుడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రంజాన్‌ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా అది కుదరలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.