విలక్షణతలో సొంత శైలి, ఇటు వినోదం, అటు సందేశం, వివిధ భావోద్వేగాల్ని ముఖంలో పలికించగలిగే నేర్పు బాలీవుడ్ నటుడు అమిర్‌ఖాన్ సొంతం. అతడి చిత్రాల్లో చాలా వరకు రొటీన్‌కు భిన్నంగా ఉంటూనే కమర్షియల్ హంగులతో సెంట్ పర్సెంట్ పైసా వసూల్‌గా ఖ్యాతి గాంచాయి.
అతడి పేరు చెప్పగానే రెండక్షరాల యువ ప్రేమను గుండెతెరపై ఆవిష్కరించిన దిల్, కనురెప్పల వాకిట్లో కలల కల్లాపి జల్లే కలర్ ఫుల్ 'రంగీలా', యువతకు స్ఫూర్తి మంత్రం అనదగ్గ 'లగాన్', ప్రేమికుల గుండెచప్పుడు 'ఇష్క్', అచ్చమైన, స్వచ్ఛమైన దేశభక్తికి వెండితెరరూపం అనదగ్గ 'మంగళ్ పాండే', మోస్ట్ పాపులర్ సినిమా 'పీకే', బ్లాక్ బస్టర్ 'రాజా హిందుస్తానీ'... ఇలా అనేకానేక సినిమాలు రీళ్లు రీళ్లుగా మనసుపై కదలాడుతాయి. బాలీవుడ్‌లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఇతడి పుట్టిన రోజు (మార్చి 14) నేడు. ఈ సందర్భంగా అతడి జీవితంలోని కొన్ని విశేషాలు మీకోసం.
వ్యక్తిగతం
నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్‌లకు 1965 మార్చి 14న ఆమిర్ జన్మించాడు. అతడి అసలు పేరు మహమ్మద్ అమిర్ హుస్సేన్ ఖాన్. కుటుంబ సభ్యులలో చాలా మంది హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నారు. నిర్మాత, దర్శకుడు నాజిర్ హుస్సేన్ అమిర్‌కు బంధువు. నటుడు ఫైజల్ ఖాన్ సోదరుడు. అతడికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు అమిర్‌తో చుట్టరికం ఉంది.
బాలనటుడిగా ఓ పాటలో ప్రవేశం
బాలనటుడిగా, అమిర్ ఖాన్ రెండు చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఎనిమిదేళ్ల వయసులో, నాజీర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన 'యాదోన్ కి బారాత్' సినిమాలో ఓ పాటలో కనిపించాడు. 'మద్ హూష్'లో మహేంద్ర సంధు చిన్నతనం పాత్రను పోషించారు అమిర్ ఖాన్.
విద్యాభ్యాసం బాంద్రా, మహిమ్‌లలో జరిగింది. అమిర్.. రాష్ట్ర స్థాయి టెన్నిస్ ఛాంపియన్, తనకు చదువులో కంటే క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు చెప్పేవాడు. ముంబయిలోని నార్సీ మోంజీ కళాశాలలో 12వ గ్రేడ్ చదివాడు. తండ్రి నిర్మించిన సినిమాలు ఫ్లాప్‌లు కావడం వల్ల తన బాల్యం ఎంతో కష్టంగా సాగిందని ఓ సందర్భంలో అమిర్ చెప్పాడు. అప్పులిచ్చిన వారి నుంచి రోజుకు 30 ఫోన్లు వచ్చేవని అన్నాడు. ఫీజు చెల్లించనందుకు ఎప్పుడూ పాఠశాల నుండి పంపేస్తారన్న భయంతో ఉండేవాడినని అమిర్ చెప్పాడు.
'దిల్' సినిమాతో భారీ విజయం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1990లలో అమిర్ ఖాన్ నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. అవి 'అవ్వల్ నెంబర్', 'తుమ్ మేరె హో', 'దీవానా ముజ్ సా నహి', 'జవానీ జిందాబాద్', 'దిల్' సినిమాలు. వీటిలో ఇంద్ర కుమార్ దర్శకత్వంలో మాధురి దీక్షిత్ హీరోయిన్గా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'దిల్' మాత్రమే పెద్దగా విజయం సాధించగలిగింది. టీనేజ్ ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించే కథాంశంతో తీసిన ఈ సినిమా.. అప్పటి యువతను బాగా ఆకర్షించింది. ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది ఇచ్చిన విజయాన్ని అమిర్ 'దిల్ హై కే మాన్ తా నహి'తో కొనసాగించాడు.
నిర్మాతగా అమిర్
2001లో 'లగాన్'లో నటించి, నిర్మించాడు అమిర్ ఖాన్. విమర్శనాత్మకంగానే కాకుండా కమర్షియల్‌గానూ విజయవంతమైంది. అలాగే ఈ సినిమా.. 74వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో నామినేషన్ పొందింది. ఎన్నో ఇతర అంతర్జాతీయ సినిమా ఉత్సవాలలో ప్రశంసలను దక్కించుకుంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మంగళ్ పాండే: ద రైజింగ్'
అమిర్ తన భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చిన తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి నాలుగు సంవత్సరాలు విరామం తీసుకున్నాడు. 2005లో 'మంగళ్ పాండే: ద రైజింగ్' సినిమాతో తిరిగి నటించడం మొదలుపెట్టాడు. దీనిని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 2006లో 'రంగ్ దే బసంతి', 'ఫనా' సినిమాలు విడుదలయ్యాయి.
2007లో 'తారే జమీన్ పర్'లో నటించడమే కాకుండా దర్శక, నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు అమిర్ ఖాన్. ఇతడు తొలిసారి దర్శకత్వం వహించింది ఈ చిత్రానికే. ప్రేక్షకుల, విమర్శకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది.
కెరీర్‌లోనే బెస్ట్ 'గజిని'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2008లో 'గజిని'తో ప్రేక్షకులను పలకరించాడు అమిర్. ఈ చిత్రం అత్యంత భారీ విజయం అందుకొంది. ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇందులో నటనకుగాను ఫిలింఫేర్ పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలకు నామినేట్ అయ్యాడు ఆమిర్.
అదే ఏడాది 'త్రీ ఇడియట్స్' విడుదలైంది. వసూళ్లలో 'గజిని' సృష్టించిన రికార్డులను అధిగమించిందీ సినిమా. చైనా, జపాన్ దేశాలలోనూ విజయం సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో విజయవంతమైన, భారతదేశ సినిమాలలో ఒకటిగా స్థానం సంపాదించుకొంది.
క్లిష్టమైన పాత్ర 'ధూమ్ 3'
యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో 'ధూమ్ 3' కోసం వర్క్ చేశాడు అమిర్. తన కెరీర్‌లో అత్యంత కష్టమైన పాత్ర అంటే 'ధూమ్ 3'లోని పాత్రే అని అమిర్ అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా 2013 డిసెంబర్ 20న విడుదలై, రెండు రోజులలోనే ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మూడు రోజుల్లో 2 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.
'పీకే'తో పీక్స్‌లో క్రేజ్
2014లో కామెడీ డ్రామా 'పీకే'లో అమిర్ ఖాన్ కనిపించాడు. అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజపుత్, బొమన్ ఇరానీ, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటించారు. విమర్శనాత్మక ప్రశంసలు అందుకొన్న ఈ సినిమా.. వసూళ్ల పరంగా సునామి సృష్టించింది. ఇందులోని నటనాపరంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు అమిర్. ఈ సినిమాకు జపాన్‌కు చెందిన ఓ పురస్కారం అతడికి లభించడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'దంగల్' సినిమాలో అమిర్ నటించడమే కాకుండా నిర్మించాడు. మహావీర్ సింగ్ ఫోగాట్ పాత్రలో అదరగొట్టాడు. పెద్ద వయసు ఉన్నట్టుగా కనిపించడానికి బరువు పెరగడం, చిన్న వయసు ఉన్నట్టుగా కనిపించడానికి బరువు తగ్గడం చేశాడు అమిర్. విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకోగలిగిందీ సినిమా.
2017 అక్టోబర్‌లో, సొంత నిర్మాణ సంస్థ అయిన అమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన 'సీక్రెట్ సూపర్ స్టార్'లో అమిర్, ఓ సహాయనటుడి పాత్రలో కనిపించాడు. 2018 నవంబర్‌లో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించాడు. 'ధూమ్ 3' తీసిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు.
2019 మార్చిలో తన 54వ పుట్టినరోజు సందర్భంగా 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటించాడు అమిర్. 1994లో హాలీవుడ్‌లో వచ్చిన 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ ఇది. అద్వైత్ చందన్ దర్శకుడు. ఇంతకు ముందు 'సీక్రెట్ సూపర్ స్టార్' కోసం వీరిద్దరూ కలిలి పనిచేశారు.
వివాహం-విడాకులు
1986 ఏప్రిల్ 18న రీనా దత్తాను వివాహం చేసుకొన్నాడు ఆమిర్. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే 2002లో తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పిల్లల బాధ్యత రీనా దత్తా తీసుకున్నారు. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు అమిర్.