కరోనా కారణంగా దేశమంతా ప్రస్తుతం లాక్డౌన్లో ఉంది. దీంతో అన్ని రంగాల్లో పనిచేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉంది నటి ఆలియా భట్. ఈమె చేతిలో ఇప్పటికే హిందీ సినిమాలతో పాటు దక్షిణాదిలో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లో చరణ్ సరసన నటిస్తోంది. అయితే లాక్‌డౌన్ తర్వాత ఎందులో ముందు నటించాలో ఈ భామకు తెలియట్లేదు.
ఇప్పటికే ఆలియా ఒప్పుకున్న సినిమాలన్నీ షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ వైరస్ తీవ్రత వల్ల వాయిదా పడ్డాయి. ఒకవేళ వచ్చే నెలలో లాక్‌డౌన్ ఎత్తేసినా, ఏయే రంగాలకు మినహాయింపు ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీలో షూటింగ్‌లు మొదలైనా, ఆలియా కష్టాలు తప్పేటట్లు లేవని అంటున్నారు. ఓవైపు సంజయ్ లీలా భన్సాలీ 'గంగుబాయ్ కతియావాడి' చిత్రీకరణలో పాల్గొన్సాల్సి ఉంది. దీంతో పాటే 'ఆర్.ఆర్.ఆర్', తన తండ్రి మహేశ్ భట్ తీస్తున్న 'సడక్ 3' చివరిభాగం షూటింగ్, 'బ్రహ్మాస్త్ర'లోనూ నటించాల్సి ఉంది. వీటిలో ఏది ముందు చేయాలో ఆలియాకు అర్థం కావడంలేదట. దీంతో ఈమె పరిస్థితి అయోమయంగా మారిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇదీ చూడండి.. 'మనిషి ప్రకృతిలో భాగమే.. దాని కంటే ఎక్కువ కాదు'