ETV Bharat / sitara

బాలీవుడ్​లో బోల్తా కొట్టిన దక్షిణాది రీమేక్​లు! - పోలీస్​ గిరీ వార్తలు

చిత్రసీమలో ఓ భాషలో విజయవంతమైన చిత్రాలను మరో భాషలో రీమేక్​ చేయడం సర్వసాధారణం. అలా దక్షిణాదిలో విజయవంతమైన చిత్రాలలో కొన్ని బాలీవుడ్​కు వలస వెళ్లాయి. అయితే అందులో ఎక్కువ శాతం హిట్ టాక్​ తెచ్చుకోగా.. మరికొన్ని అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ విధంగా ఇక్కడ సూపర్​హిట్​ అయ్యి.. హిందీ చిత్రసీమలో పరాజయం పొందిన చిత్రాల వివరాలు తెలుసుకుందాం.

Bollywood remakes of South Indian movies that failed at the box office
బాలీవుడ్​లో బోల్తా కొట్టిన దక్షిణాది సినిమాలు!
author img

By

Published : Dec 5, 2020, 9:57 AM IST

ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్​ చేసి విడుదల చేయడం లేదా రీమేక్​ చేయడం చిత్రసీమలో షరా మామూలే. ఇలా బాలీవుడ్​ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ హిందీలో రీమేక్​ అయ్యాయి. తమిళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'గజిని' (2008) నుంచి 'అర్జున్​రెడ్డి' (2019) వరకు బాలీవుడ్​లో అనేక రీమేక్​ సినిమాలు సూపర్​హిట్​ అయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ సూపర్​హిట్​ అయ్యి బాలీవుడ్​లో తుస్సుమనిపించిన సినిమాల వివరాలేంటో చూడండి.

ఓకే జాను (2017)

Bollywood remakes of South Indian movies that failed at the box office
ఓకే జాను (2017)

విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన రొమాంటిక్​ చిత్రం 'ఓ కాదల్​ కన్మయి' (2015). తెలుగులో 'ఓకే బంగారం'గా విడుదల చేసి హిట్​ను అందుకున్నారు. అయితే ఇదే సినిమాను బాలీవుడ్​లో 'ఓకే జాను'గా రూపొందించగా బాక్సాఫీస్​ వద్ద ఫ్లాప్​గా నిలిచింది.

రన్​ (2004)

2002లో విడుదలైన 'రన్​' అనే తమిళ చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్​లో రీమేక్​ చేశారు. ఇందులో అభిషేక్​ బచ్చన్​, భూమిక చావ్లా ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం ఎదుర్కోవడం సహా విమర్శకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేసినప్పుడు విశేషాదరణ దక్కించుకుంది.

ప్రస్థానం (2019)

టాలీవుడ్​లో విడుదలైన 'ప్రస్థానం' (2010) చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్​లో తెరకెక్కించారు. ఇందులో సంజయ్​ దత్​, మనీషా కోయిరాల, జాకీ ష్రాఫ్​, అలీ ఫజల్​, సత్యజిత్​ దూబే, అమైరా దస్తూర్​, చుంకీ పాండే ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

రామయ్యా వస్తావయ్యా (2013)

ప్రముఖ కొరియోగ్రాఫర్​ ప్రభుదేవా తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005). ఈ చిత్రాన్ని బాలీవుడ్​లో 'రామయ్యా వస్తావయ్యా' (2013)గా రీమేక్​ చేశారు. ఇందులో గిరీశ్​ తౌరానీ, శ్రుతీ హాసన్​ లీడ్​ రోల్స్​ చేశారు. ఇందులోని పాటలకు మంచి ప్రేక్షాదరణ లభించినా.. అది సినిమా విజయానికి దోహదపడలేకపోయింది.

కట్టా మీటా (2010)

1988లో విడుదలైన మలయాళ చిత్రం 'వెల్లనకలుడే నాడు' చిత్రాన్ని బాలీవుడ్​లో 'కట్టా మీటా'గా దర్శకుడు ప్రియదర్శన్​ రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్​ కుమార్​ సరసన హీరోయిన్​ త్రిష కృష్ణన్ నటించడం సహా ఇదే చిత్రంతో​ బాలీవుడ్​ అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు నెగిటివ్​ రివ్యూస్​ రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొంది.

పోలీస్​గిరి (2013)

తమిళ చిత్రం 'సామి'కి హిందీ రీమేక్​ ఇది. సంజయ్​ దత్​, ప్రాచీ దేశాయ్​ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ మెప్పించలేకపోయింది.

ఖుషీ (2003)

2000లో విడుదలైన తమిళ చిత్రం 'ఖుషీ'.. అదే పేరుతో బాలీవుడ్​లో రీమేక్​ చేశారు. బాలీవుడ్​ చరిత్రలో ఇదో చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది.

ఇదీ చూడండి: 'ట్రైలర్​' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.