ETV Bharat / sitara

డ్రగ్స్ కేసు విచారణ.. ముంబయికి దీపిక, సారా

డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం గోవా నుంచి ముంబయికి ప్రత్యేక విమానాల్లో పయనమయ్యారు ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్. శుక్రవారం, శనివారం ఎన్​సీబీ అధికారుల ముందు హాజరు కానున్నారు.

author img

By

Published : Sep 24, 2020, 4:42 PM IST

Bollywood drug probe: Deepika cuts short Goa shoot
హీరోయిన్ దీపికా పదుకొణె

బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం ఎన్​సీబీ ముందు శుక్రవారం హాజరు కానుంది. ఇందులో భాగంగానే గోవాలో తన సినిమా షూటింగ్ మధ్యలో ఆపుచేసి, ముంబయి విమానమెక్కింది. అంతకు ముందు తన న్యాయ బృందంతో కేసు విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ సారా అలీఖాన్​ కూడా గోవా నుంచి ముంబయి బయల్దేరింది.

sara ali khan
గోవా విమనాశ్రయంలో హీరోయిన్ సారా అలీఖాన్

బుధవారం ఈమెతోపాటు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్​లకు ఎన్​సీబీ నోటీసులు జారీ చేసింది.

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌తో పాటు టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహానూ ఎన్​సీబీ అధికారులు విచారించారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్‌ గురించి జరిగిన చాటింగ్‌ వివరాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు కొన్ని రోజుల పాటు విచారించి అరెస్టు చేశారు. ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నారు. రియాను విచారించిన క్రమంలో సారా అలీఖాన్‌, రకుల్‌ పేర్లు బయటకు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.