తమ అభిమాన నటుల పుట్టినరోజు వచ్చిందంటే సినీప్రేక్షకులకు పండగే. నెట్టింట్లో వారికి సంబంధించిన ఫోటోలు, కామెంట్లతో అభిమానాన్ని చాటుతుంటారు. వారి వయసు తెలుసుకునేందుకు ఉత్సాహపడుతుంటారు. అయితే కొంతమంది నటులు.. ఈ ఏడాదితో 30వ పడిలోకి అడుగుపెడుతున్నారు. వారెవరో ఓసారి చూద్దాం.
యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్.. 1990 మార్చి 2న జన్మించాడు. సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన టైగర్.. 'భాగీ' సిరీస్, 'వార్' సహా తదితర సినిమాల్లో కనువిందు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కృతిసనన్.. 1990, జులై 27న దిల్లీలో జన్మించింది. బాలీవుడ్లో స్టార్ హీరోయన్‌గా రాణిస్తోంది. 'హీరోపంతి', 'బార్లీ కి బర్ఫీ', 'లుకా చుప్పీ' సినిమాలతో స్టార్ అయిపోయింది. తెలుగులో మహేశ్ సరసన 'నేనొక్కడినే' సినిమాలో నటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రకుల్ ప్రీత్ సింగ్.. 1990 అక్టోబర్ 10న పంజాబీ కుటుంబంలో జన్మించింది. 'యారియన్' చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ ఫిట్నెస్ హీరోయిన్గా పేరు గాంచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పూజా హెగ్డే.. ముంబయికి చెందిన ఈ భామ పుట్టినరోజు అక్టోబర్ 13. ఈమె తల్లిదండ్రులు కర్ణాటకకు చెందిన వారు. మాతృభాష తులు. తమిళ, తెలుగు, హిందీచిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్'లో నటిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కృతి కర్బందా.. దిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు అక్టోబర్ 29. ఈమె కూడా తెలుగు, హిందీ సహా పలుభాషా చిత్రాల్లో నటిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కార్తిక్ ఆర్యన్.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా పేరుగాంచాడు. అసలు పేరు కార్తిక్ తివారీ. 'ప్యార్ కా పంచనామా' సినిమాతో అరంగేట్రం చేసిన ఇతడు.. 'ఆకాశ్ వాణీ', 'లుకా చుప్పీ' సహా పలు హిట్ సినిమాల్లో మెరిశాడు. ప్రస్తుతం 'దోస్తానా 2'లో నటిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వరుణ్ శర్మ.. పంజాబ్‌లోని జలంధర్ గ్రామంలో ఫిబ్రవరి 4న జన్మించాడు. 'కిస్ కిస్కో ప్యార్ కరూన్', 'దిల్వాలే', 'ఫక్రీ రిటర్న్స్', 'చిచ్చోరె' సినిమాలతో గుర్తింపు పొందాడు..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూడండి గిటార్ వాయిస్తూ.. ప్రేమ గీతం పాడుతున్న రాశీ ఖన్నా